‘అచ్చెన్నాయుడు డిశ్చార్జిని ఖండిస్తున్నాం’

తాజా వార్తలు

Updated : 01/07/2020 19:47 IST

‘అచ్చెన్నాయుడు డిశ్చార్జిని ఖండిస్తున్నాం’

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు డిశ్ఛార్జిని ఖండిస్తున్నామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీజీహెచ్‌ నుంచి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జిపై  చంద్రబాబు స్పందించారు. ‘‘ప్రభుత్వ ఒత్తిడితో డిశ్ఛార్జి‌ చేయడాన్ని ఖండిస్తున్నాను. డిశ్ఛార్జి‌ చేయడంలో కనీస నిబంధనలు పాటించకపోవడం గర్హనీయం. కమిటీ పేరుతో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పిచండం శోచనీయం. సాయంత్రం ఐదు తర్వాత 4.20 సమయం వేసి డిశ్ఛార్జి చేయడం దుర్మార్గం’’ అని చంద్రబాబు అన్నారు. 

‘‘అచ్చెన్నాయుడిని డిశ్ఛార్జి చేయడానికి ఖండిస్తున్నాను. ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. గాయం మానకముందే వైద్యులపై ఒత్తిడి చేసి అచ్చెన్నాయుడుని డిశ్ఛార్జి చేశారు’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మరోవైపు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడిని జైలు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని