ప్రజల నమ్మకానికి ద్రోహం చేశారు: గహ్లాత్‌

తాజా వార్తలు

Published : 11/03/2020 00:39 IST

ప్రజల నమ్మకానికి ద్రోహం చేశారు: గహ్లాత్‌

దిల్లీ: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేయడంపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లాత్‌ పలు విమర్శలు చేశారు. ప్రజల నమ్మకాలు, సిద్ధాంతాలకు సింధియా ద్రోహం చేశారని నిందించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ‘దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న సమయంలో భాజపాతో చేతులు కలపడం ఆయన స్వార్థ రాజకీయ ఆశయాలను ప్రతిబింబిస్తోంది. సింధియా ప్రజల నమ్మకాలనే కాకుండా.. సిద్ధాంతాలకు కూడా ద్రోహం చేశారు. ఇలాంటి వ్యక్తులు అధికారం లేకుండా మనుగడ సాధించలేరని సింధియా నిరూపించారు. త్వరలో వారు మంచిని వదిలివేయనున్నారు’ అని గహ్లాత్‌ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. 

మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయనకు అనుకూలంగా ఉండే 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. బెంగళూరులో ఉన్న ఆ ఎమ్మెల్యేలంతా మెయిల్‌ ద్వారా తమ రాజీనామాలను రాజ్‌భవన్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని