కేజ్రీవాల్‌, సిసోడియా ఎన్నికపై పిటిషన్‌

తాజా వార్తలు

Published : 27/02/2020 14:44 IST

కేజ్రీవాల్‌, సిసోడియా ఎన్నికపై పిటిషన్‌

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఎన్నికను సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరు కోడ్‌ ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రతాప్‌ చంద్ర అనే అభ్యర్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

నిబంధనల ప్రకారం ఎన్నికలకు 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారాలు చేయవద్దని, అయితే కేజ్రీవాల్‌, సిసోడియా ఆ సమయంలోనూ తమ ప్రచారాలు సాగించారని ప్రతాప్‌ చంద్ర ఆరోపించారు. వీరిద్దరి ఎన్నిక చెల్లదని ప్రకటించి.. ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనలను స్వీకరించిన న్యాయస్థానం.. ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల కమిషన్‌ మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీకి నోటీసులు జారీ చేసింది. ప్రతాప్‌ చంద్ర పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్‌ చంద్ర.. కేజ్రీవాల్‌, సిసోడియాలపై పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని