‘అందుకే కేజ్రీ మళ్లీ మమ్మల్నే ఎన్నుకున్నారు’

తాజా వార్తలు

Published : 16/02/2020 11:56 IST

‘అందుకే కేజ్రీ మళ్లీ మమ్మల్నే ఎన్నుకున్నారు’

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తిరిగి పాత కేబినెట్‌లోని మంత్రులే మళ్లీ ప్రమాణం చేయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో గత కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రి సహా మరికొన్ని కీలక శాఖల బాధ్యతలు నిర్వహించిన మనీష్‌ సిసోడియా మాట్లాడారు. తమ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు సంతృప్తి చెందారని అందుకే తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేశారన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో మంత్రులు కీలక పాత్ర పోషించారన్నారు. ‘‘తిరిగి పాత కేబినెట్‌నే ఎన్నుకోవాలనుకోవాలన్న కేజ్రీవాల్‌ ఆలోచన సరైందనే అనుకుంటున్నాను. మంత్రుల పనితీరుతో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. మా పనితీరు ఆధారంగానే ఎన్నికల్లో గెలిచాం. అందుకే కేజ్రీవాల్‌ తిరిగి పాత కేబినెట్‌నే కొలువుదీర్చాలనుకుంటున్నారు. ప్రజల విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము కానివ్వబోం’’ అని సిసోడియా వ్యాఖ్యానించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తిరుగులేని విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

మరికాసేపట్లో చరిత్రాత్మక రాంలీలా మైదానంలో కేజ్రీవాల్‌ సహా మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాలన్నీ భద్రతా బలగాల వలయంలోకి వెళ్లాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని