తెరాస హయాంలో నేరాలు తగ్గాయ్‌: హోంమంత్రి

తాజా వార్తలు

Updated : 17/01/2020 11:33 IST

తెరాస హయాంలో నేరాలు తగ్గాయ్‌: హోంమంత్రి

హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వమే అత్యధికంగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పోలీస్‌ శాఖకు మరింత ప్రాధాన్యం కల్పించామన్నారు. శుక్రవారం కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంబించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  తెరాస హయాంలో రాష్ట్రంలో నేరమయ ఘటనలు తగ్గాయన్నారు. శిక్షణా కాలంలో కానిస్టేబుళ్లకు మంచి వేతనం అందజేస్తున్నామన్నారు. షీటీమ్‌ల ద్వారా నిఘా పెరిగిందని చెప్పారు. 267 మంది కానిస్టేబుళ్ల శిక్షణ అభ్యర్థులకు 9 నెలల పాటు కొనసాగనుంది. నైపుణ్యం, సమయస్ఫూర్తితోనే విజయం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. నైపుణ్యం, సమయస్ఫూర్తి ఉన్నప్పుడే విజయం సాధించగలుగతామని చెప్పారు. తొమ్మిది నెలల శిక్షణ కాలంలో నేర్చుకున్న  నైపుణ్యం.. విధుల్లో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. శిక్షణ కానిస్టేబుళ్లలో ఉన్నత విద్యావంతులే అధికంగా ఉన్నారని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని