వారికి ఓటేస్తే.. ఆ ఓటు

తాజా వార్తలు

Published : 12/01/2020 01:05 IST

వారికి ఓటేస్తే.. ఆ ఓటు

దిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఓటేస్తే.. ఉచిత విద్యుత్‌, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యానికి వ్యతిరేకంగా మీరు ఓటేసినట్లే అని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. శనివారం ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. భాజపాపై విమర్శల వర్షం కురిపించారు. ‘ఫ్రీలోడర్స్‌’ అంటూ దిల్లీ ప్రజలను ఆ పార్టీ అవమానిస్తోందని ఆరోపించారు. 

‘ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా అనుకూల పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న దిల్లీ వాసులను భాజపా ఫ్రీలోడర్స్‌ అంటూ అవమానించింది. ఇందుకు ఆ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఉచిత విద్యుత్‌, ఉచిత నీరు, మహిళలకు ఉచిత రవాణా వంటి పథకాలకు కాషాయ పార్టీ వ్యతిరేకం. ఇలా వ్యతిరేకించడం పార్టీ అజెండా కావొచ్చు.. కానీ ఆ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న ప్రజలను అవమానించడం సరికాదు. ప్రజలకు సేవ చేయడం ప్రతి ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకే మేం ఇక్కడ ఉన్నాం’ అని సిసోడియా చెప్పుకొచ్చారు. 

దిల్లీ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న అక్కడ పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడుతాయి. దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచి అఖండ విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. అటు లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 7 నియోజకవర్గాల్లో గెలిచిన భాజపా.. శాసనసభలోనూ విజయఢంకా మోగించాలని ఆశపడుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని