ఉచిత వాషింగ్‌మెషిన్‌.. ఉచిత కేబుల్‌ టీవీ!

తాజా వార్తలు

Updated : 14/03/2021 20:33 IST

ఉచిత వాషింగ్‌మెషిన్‌.. ఉచిత కేబుల్‌ టీవీ!

అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల

చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 164 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం దీన్ని విడుదల చేశారు. ఇందులో ఎప్పటిలానే ఉచితాలకు పెద్దపీట వేశారు. ఉచిత వాషింగ్‌ మెషిన్లు, కేబుల్‌ టీవీ వంటివి ఇందులో ఉన్నాయి.

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఉచిత వాషింగ్‌మెషిన్లు, ఉచిత సోలార్‌ స్టవ్‌లు, అందరికీ ఉచిత కేబుల్‌ టీవీ సౌకర్యం కల్పిస్తామని అన్నాడీఎంకే తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. రేషన్‌ సరకులను ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని, ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామని పేర్కొంది. అమ్మ హౌసింగ్‌ పథకం కింద ఇళ్లు నిర్మిస్తామని పేర్కొంది. ఏటా పొంగల్‌కు ఇచ్చే రూ.2,500 నగదు పథకం కొనసాగుతుందని స్పష్టంచేసింది. 

మహిళలకు సిటీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని, ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 దినాలకు పెంచుతామని పేర్కొంది. ఆటో రిక్షాలు కొనుగోలు చేయాలనుకునేవారికి రూ.25వేలు సబ్సిడీ, కాలేజీ విద్యార్థులకు ఉచిత 2జీబీ డేటా అందిస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచింది. శ్రీలంక తమిళ శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం, విద్యారుణాల రద్దు, మద్యం దుకాణాల తగ్గింపు వంటివీ ఇందులో ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని