TS News: కమలాపూర్‌లో ఈటల రోడ్‌షో

తాజా వార్తలు

Updated : 08/06/2021 12:51 IST

TS News: కమలాపూర్‌లో ఈటల రోడ్‌షో

కమలాపూర్‌: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఆయ‌న తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు. పర్యటనలో భాగంగా కమలాపూర్‌ మండలంలో ద్విచక్రవాహనాలతో ఆయన అభిమానులు రోడ్‌షో చేపట్టారు. శంభునిపల్లి, కానెపర్తి గ్రామాల మీదుగా రోడ్‌షో కొనసాగింది. ఈటల మద్దతుదారులు, అభిమానులు, యువకులు ‘జై-ఈటల’ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు మంగళహారతులతో ఈటలకు ఘన స్వాగతం పలికారు. కమలాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈట‌ల ప‌ర్య‌ట‌న దృష్ట్యా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహ‌రించారు. 

మంత్రి ప‌దవి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయిన ఈట‌ల.. ఇటీవల తెరాస పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విష‌యం తెలిసిందే. అంత‌కుముందు దిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఈట‌ల భాజపా జాతీయ స్థాయి నాయ‌కుల‌ను క‌లిశారు. మ‌రోవైపు ఆయ‌న వారం రోజుల్లో భాజపా తీర్థం పుచ్చుకోనున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని