బెంగాల్‌.. గుజరాత్‌లా మారాలా?

తాజా వార్తలు

Published : 08/04/2021 15:27 IST

బెంగాల్‌.. గుజరాత్‌లా మారాలా?

ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్న మమత

హూగ్లీ: పశ్చిమబెంగాల్‌ నాలుగో విడత ఎన్నికల ప్రచారంలో సీఎం మమతా బెనర్జీ దూసుకెళ్తున్నారు. భాజపాపై పదునైన విమర్శలతో ప్రచారంలో దూకుడు పెంచారు. గురువారం హూగ్లీ జిల్లా బాలాగఢ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దీదీ.. భాజపా, కేంద్ర బలగాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. పోలింగ్‌ ప్రక్రియ జరుగుతున్నప్పుడు భాజపా, కేంద్ర బలగాల భయాలకు ఓటర్లు తలొగ్గొద్దని విజ్ఞప్తి చేశారు. భాజపా పాలనలో యావత్‌ దేశం కన్నీరు పెడుతోందని ఆరోపించారు. భాజపా గూండాయిజానికి పాల్పడుతోందని మండిపడ్డారు. 

బెంగాల్‌ మరో గుజరాత్‌లా మారాలని కోరుకుంటున్నారా? అని ఓటర్లను దీదీ ప్రశ్నించారు.  ఈసారి బెంగాల్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  తాను కేంద్ర బలగాలను నిందించడంలేదని, కానీ వాటి బాధ్యత మాత్రం కేంద్ర హోంమంత్రిత్వశాఖదేనన్నారు. భద్రతా బలగాలు గ్రామాలకు వెళ్లి భాజపాకు ఓటేయాలని అడుగుతున్నారని మరోసారి ఆరోపించారు. ఒకవేళ మిమ్మల్ని బెదిరిస్తే.. వారికి తలొంచొద్దు అని ఓటర్లకు సూచించారు. పోలింగ్‌ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎన్నికల విజయంలో మహిళలదే కీలక పాత్ర అని తెలిపారు. ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా ఓటర్లను అడ్డుకొని వారిపై దాడి చేస్తున్నారంటూ ఇప్పటికే దీదీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని