ఇప్పుడే పరీక్ష రాశాను: ఉదయనిధి స్టాలిన్

తాజా వార్తలు

Published : 06/04/2021 11:45 IST

ఇప్పుడే పరీక్ష రాశాను: ఉదయనిధి స్టాలిన్

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున బరిలో ఉన్న యువనేత ఉదయనిధి స్టాలిన్‌ పోలింగ్‌ను పరీక్షలతో పోల్చారు. ఆయన మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి తేనంపేట పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఎన్నికల్లో ఆరంగేట్రం చేసిన సందర్భంగా.. తన పరీక్ష ఇప్పుడే పూర్తయిందంటూ మీడియాతో వెల్లడించారు.

‘నాతో పాటు ప్రతి డీఎంకే అభ్యర్థి గెలవాలని ఆశిస్తున్నా. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం’ అని ఉదయనిధి తెలిపారు. భవిష్యత్తులో మీరు మంత్రి కాబోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. డీఎంకే గెలిస్తే తాను మంత్రి కావాలా? వద్దా? అనేది తమ నాయకుడే నిర్ణయిస్తారని అన్నారు. డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్‌ చెపాక్‌-తిరువల్లికేని స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడు వచ్చిన సందర్భంగా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉదయనిధిపై విమర్శలు చేశారు. తమిళనాడు అభివృద్ధి కావాలా.. ఉదయనిధి లాంటి వారసులు ఎదగటం కావాలా అని ఓటర్లను ప్రశ్నించారు. దీనిపై ఉదయనిధి స్పందిస్తూ.. తనపై ఏమైనా ఆస్తులు ఉంటే అవన్నీ అమిత్‌షా కుమారుడు జై షా పేరున రాస్తాను. మరి జై పేరు మీద ఉన్న ఆస్తులు తన పేరు మీద రాయడానికి సిద్ధమా? అని అమిత్‌షాను ఎదురు ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని