TS news: మాన్యువల్‌ స్కావెంజర్‌ పనులు ఉండవన్నారు.. మరెలా చనిపోయారు?

తాజా వార్తలు

Updated : 06/08/2021 05:25 IST

TS news: మాన్యువల్‌ స్కావెంజర్‌ పనులు ఉండవన్నారు.. మరెలా చనిపోయారు?

ఎల్‌బీనగర్‌లో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికుల మృతిపై దాసోజు శ్రవణ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మాన్యువల్‌  స్కావెంజర్ పనుల్లో  ప్రాణాలు కోల్పోయారని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో మురుగు కాల్వలో పని చేస్తూ ఇద్దరు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్‌లో మాన్యువల్‌ స్కావెంజర్‌ పనులు ఉండవని గతంలో మంత్రి కేటీర్‌ ప్రకటించారని, మరి నిన్న ఇద్దరు ఎలా చనిపోయారని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో శ్రవణ్‌ మాట్లాడుతూ.. బాధితుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మే నెలలో జరగాల్సిన డిసిల్టింగ్ పనులు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నాయని, దీనికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బాధ్యత వహించాలని అన్నారు. డిసిల్టింగ్ పనుల్లో మున్సిపల్‌, వాటర్ వర్క్స్ అధికారుల మధ్య సమన్వయం లేదన్నారు.

‘‘ డిసిల్టింగ్ పనుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదు. దాంతో వారు సకాలంలో పనులు చేయడం లేదు. అంతే కాకుండా అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కావెంజర్ పనులు చేసే వాళ్ల భద్రతకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకొనే వస్తువులు అందించాలి. ఇద్దరు కార్మికుల చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తున్న హైదరాబాద్‌లో ఎందుకు అభివృద్ధి పనులు చేయడం లేదు? హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం పెద్ద చర్చ పెట్టాలి.’’ అని శ్రవణ్‌ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని