TS News: ఈట‌ల వ్యాఖ్య‌లు నిరాధార‌మైన‌వి: చాడ‌

తాజా వార్తలు

Published : 05/06/2021 13:18 IST

TS News: ఈట‌ల వ్యాఖ్య‌లు నిరాధార‌మైన‌వి: చాడ‌

హైద‌రాబాద్‌: క‌మ్యూనిస్టు పార్టీల‌పై మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ చేసిన వ్యాఖ్య‌లు నిరాధార‌మైన‌వ‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్‌రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై అనేక ప్ర‌జా పోరాటాలు చేస్తున్న సీపీఐ.. సీఎం మార్గ‌నిర్దేశనంలో పని చేస్తుంద‌ని అస‌త్య ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. అసైన్డ్ దేవాల‌య భూములు ఎవ‌రు కొన్నా త‌ప్పేన‌ని.. త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌ని చాడ సూచించారు. ప్ర‌భుత్వం అసైన్డ్ భూముల‌ను ప‌రిర‌క్షించాల‌ని లేక‌పోతే మ‌ళ్లీ భూపోరాటాలు చేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. పెరిగిన‌ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ అన్ని జిల్లాల్లో ఆందోళ‌న‌లు చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. భూముల డిజిట‌ల్ స‌ర్వేపై విధివిధానాల‌ను రూపొందించేందుకు అఖిల‌ప‌క్షాన్ని పిల‌వాల‌ని ముఖ్య‌మంత్రిని కోరాన‌ని చాడ వెంక‌ట్‌రెడ్డి తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని