ప్రధాని అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్‌, అకాలీదళ్‌ దూరం!

తాజా వార్తలు

Published : 20/07/2021 17:59 IST

ప్రధాని అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్‌, అకాలీదళ్‌ దూరం!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం, కట్టడి చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న అఖిలపక్ష సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు కాంగ్రెస్‌, అకాలీదళ్‌ ప్రకటించాయి. ఈ భేటీకి తాము హాజరు కావడంలేదని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో కరోనా పరిస్థితులపై వాస్తవాలను ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు, గతంలో భాజపా మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కావడంలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. 

కరోనా మేనేజ్‌మెంట్‌పై అన్నిపార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశాఖ కార్యదర్శి దేశంలో కరోనా పరిస్థితి, తీసుకొంటున్న చర్యలను వివరించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.  మరోవైపు, కరోనా మహమ్మారిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ భవనంలో సెషన్‌ నిర్వహిస్తున్నట్టు శనివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ వెల్లడించారు. అయితే, కరోనాపై తొలుత పార్లమెంట్‌ ఉభయ సభల్లో చర్చ జరగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌చేస్తోంది.  ప్రధాని నరేంద్ర మోదీ కరోనాపై ప్రజెంటేషన్‌ ఇవ్వాలనుకుంటే ఉభయసభల సభ్యులకు సెంట్రల్‌ హాల్‌లో ఇవ్వాలని ఖర్గే కోరారు. తమ నియోజకవర్గాల్లో పరిస్థితులను వివరించేందుకు ఎంపీలకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. అలాగైతే తాము సమావేశానికి హాజరవుతామని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని