TS news: దళితుల మనోభావాలతో కేసీఆర్‌ చెలగాటమాడుతున్నారు: జీవన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 05/08/2021 15:49 IST

TS news: దళితుల మనోభావాలతో కేసీఆర్‌ చెలగాటమాడుతున్నారు: జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: దళితుల మనోభావాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు ఎస్సీలు గుర్తొస్తారని విమర్శించారు. కేసీఆర్‌ తొలివిడతలో ఎస్సీకి డిప్యూటీ సీఎం ఇచ్చారని, రెండోసారి గెలిచిన తర్వాత అది కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..  ‘‘ ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని మాట తప్పారు. ఏడేళ్లలో దళితులకు కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేయలేదు. కేసీఆర్‌ పాలనలో దళితులపై ప్రేమ ఉన్నట్లు కనిపించడం లేదు. ఉద్యోగాల భర్తీ చేయకుండా దళితులకు అన్యాయం చేస్తూ, దళిత బంధు అమలు చేస్తున్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం దళితులకు 35వేల ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు’’ అని విమర్శించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఉపముఖ్యమంత్రి పదవి ఎందుకివ్వరని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.ఆయనకు ఆ అర్హత లేదా? అని అన్నారు.దళితులకు ఇస్తున్న రూ.10లక్షలు కేసీఆర్ జేబులో నుంచి ఇవ్వడం లేదని,  ఏడేళ్ల కాలంలో దళితుల్ని అవమానించి ఇప్పుడు రూ.10లక్షలు ఇస్తే సరిపోతుందా? అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల సమస్యలు పరిష్కరించే వరకు ఓట్లు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదని విమర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని