
తాజా వార్తలు
సాగు చట్టాలపై కేసీఆర్ యూటర్న్: భట్టి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను మొదట్లో వ్యతిరేకించిన సీఎం కేసీఆర్, దిల్లీ వెళ్లొచ్చాక యూటర్న్ తీసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు భట్టి లేఖ రాశారు. విద్యుత్ చట్టాలపై చేసిన విధంగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని భట్టి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత అవసరాల కోసం అన్నదాతల భవిష్యత్‌ను తాకట్టు పెట్టడం సరికాదని హితవు పలకారు. సాగు చట్టాలను కేంద్రం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని భట్టి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..
టీకాలపై ఆప్షన్ లేదు..!
పోలీసులపై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు