హుజూరాబాద్‌లో గెలవబోతున్నాం: సంజయ్‌

తాజా వార్తలు

Updated : 04/07/2021 14:07 IST

హుజూరాబాద్‌లో గెలవబోతున్నాం: సంజయ్‌

హైదరాబాద్‌: తెరాస కుట్రలను ఎదుర్కొని హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలవబోతున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హుజూరాబాద్‌ ఇన్‌ఛార్జి, మండల ఇన్‌ఛార్జులకు దిశానిర్దేశం చేశారు.

తెరాస నీచమైన ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రూ.కోట్లు గుమ్మరించి హుజూరాబాద్‌లో గెలవడానికి ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నారని బండి సంజయ్‌ చెప్పారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా నేతలు డి.కె.అరుణ, ఈటల, రాజాసింగ్‌, మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఆగస్టు 9న రాష్ట్ర వ్యాప్తంగా భాజపా మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు బండి సంజయ్‌ ప్రకటించారు. కేసీఆర్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా దీన్ని చేపడుతున్నామన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని