TS POLITICS: 21 జిల్లాలకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం

తాజా వార్తలు

Updated : 04/08/2021 05:11 IST

TS POLITICS: 21 జిల్లాలకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం

హైదరాబాద్‌: మహిళా కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం తెలంగాణలోని 21 జిల్లాలకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులను నియమించింది. ఇటీవల రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జిల్లా అధ్యక్ష బాధ్యతల కోసం ఆసక్తి చూపుతున్న వారితో సమావేశమైన రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు ..అర్హులైన వారి పేర్లను దిల్లీ జాతీయ మహిళా కాంగ్రెస్‌కు సిఫారసు చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలి సిఫారసు ఆధారంగా ఇవాళ 21 జిల్లాలకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులను ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుశ్మితాదేవ్‌ నియమించారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 14 మందిని, ప్రధాన కార్యదర్శులుగా 13 మందిని నియమిస్తూ ఇవాళ సుశ్మితాదేవ్‌ ప్రకటన చేశారు. మిగిలిన జిల్లాలకు అధ్యక్షులను త్వరలో ఎంపిక చేయనున్నట్టు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని