’చూస్తూ కూర్చోవద్దు.. కేంద్రం ఏదైనా చేయాలి’

తాజా వార్తలు

Published : 13/10/2020 16:21 IST

’చూస్తూ కూర్చోవద్దు.. కేంద్రం ఏదైనా చేయాలి’

కాలుష్య సమస్యపై సిసోడియా విజ్ఞప్తి

దిల్లీ: పంట వ్యర్థాల దహనంతో ఏర్పడుతున్న కాలుష్యం ఒక్క దిల్లీ నగరానికే కాదు.. యావత్‌ ఉత్తర భారతదేశానికే పెద్ద సమస్యగా మారిందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారు. కాలుష్య స్థాయిని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ఎప్పటినుంచో పనిచేస్తోందని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమస్య పరిష్కారంలో కేంద్రం తీరు దురదృష్టకరమన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం ఏమీ చేయడంలేదని, ఏడాదిగా కూర్చుని చూస్తోందని ఆరోపించారు. ఈ సమస్యతో మొత్తం ఈశాన్య భారతం బాధపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించడంలో తనదైన పాత్ర పోషించాలని, అలాగే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు బాధ్యతతో పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. కాలుష్యంతో కూడిన ఓవైపు కాలుష్యం.. మరోవైపు కరోనా వైరస్‌ ప్రజలకు ప్రాణాంతకంగా మారాయని సిసోడియా ఆందోళన వ్యక్తంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని