‘పోలవరంపై తెదేపా గందరగోళం సృష్టించింది’

తాజా వార్తలు

Published : 04/11/2020 00:56 IST

‘పోలవరంపై తెదేపా గందరగోళం సృష్టించింది’

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రం ఇవ్వాల్సిందేనని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో తెదేపా ప్రభుత్వం లేనిపోని గందరగోళం సృష్టించిందని.. అందుకే ఇప్పుడు నిధుల విషయంలో వివాదం రేగిందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలు కలిసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు యత్నించాలని ఆయన కోరారు. 

అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే ప్రత్యేక రాయలసీమ, ఉత్తరాంధ్ర ఉద్యమాలు వచ్చే అవకాశముందని అవంతి అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌ మూడు రాజధానుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కాస్మోపాలిటన్‌ నగరం విశాఖ ఒక్కటేనన్నారు. వైకాపా ప్రభుత్వానికి అన్ని కులాలు కావాలని.. తెదేపా ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని మంత్రి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని