Raghurama: ఎంపీ రఘురామ డిశ్చార్జ్‌

తాజా వార్తలు

Updated : 26/05/2021 11:54 IST

Raghurama: ఎంపీ రఘురామ డిశ్చార్జ్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసి గుంటూరు తరలించింది. 

ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన్ను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్‌ మంజూరు చేసింది.  దీంతో ఆయన ఈరోజు డిశ్చార్జ్‌ అయ్యారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామకృష్ణరాజు నేరుగా దిల్లీ వెళ్లనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని