అవన్నీ ఊహాగానాలే: యడియూరప్ప

తాజా వార్తలు

Published : 18/09/2020 16:35 IST

అవన్నీ ఊహాగానాలే: యడియూరప్ప

దిల్లీ: కర్ణాటకలో జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ భాజపా ప్రభుత్వంతో చేతులు కలుపుతుందంటూ వస్తున్న ఊహాగానాలపై భాజపా నేత, సీఎం యడియూరప్ప స్పందించారు. ఇటీవల మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి ముఖ్యమంత్రితో సమావేశం కావడంతో రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయంటూ జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న యడియూరప్ప శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అవన్నీ ఊహగానాలే. దీంట్లో వాస్తవం లేదు. కుమారస్వామి ఇటీవల ఓ ప్రతిపక్ష పార్టీ నేతగా వచ్చి నన్ను కలిశారు. అభివృద్ధి పనులపైనే చర్చించాం. ఈ సమావేశంలో రాజకీయ అంశాలేమీ చర్చకు రాలేదు. రాష్ట్రంలో మా పార్టీకి తగిన మెజార్టీ ఉంది. జేడీఎస్‌ నుంచి ఎలాంటి మద్దతూ మాకు అవసరం లేదు’’ అని స్పష్టంచేశారు. 

ఓర్వలేకే అలాంటి విమర్శలు

యడియూరప్ప తనయుడు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర సూపర్‌ సీఎంలా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల్ని ఆయన తిప్పికొట్టారు. విజయేంద్ర పార్టీ పనులపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారని, పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. అతడి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొందరు రాజకీయ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా దిల్లీకి వెళ్లిన యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఈ రోజు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చించనున్నట్టు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని