ఆ బిల్లుపై కేంద్రమంత్రే రాజీనామా చేశారు: హరీశ్‌

తాజా వార్తలు

Published : 26/09/2020 18:46 IST

ఆ బిల్లుపై కేంద్రమంత్రే రాజీనామా చేశారు: హరీశ్‌

దుబ్బాక: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతు వ్యతిరేక బిల్లులపై ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించారు. కేంద్ర వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఒక కేంద్రమంత్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఈ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు అన్నారు. కేసీఆర్‌ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం నెల రోజుల్లో అమల్లోకి వస్తుందని, భూ సమస్యలన్నీ పరిష్కరించి కొత్త పాసు పుస్తకాలు అందిస్తామన్నారు. డిజిటల్‌ సర్వే చేయిస్తున్నామన్నారు. ప్రతి ఎకరా, ప్రతి గుంట భూమినీ కొలిచి ఇస్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని