సాగుచట్టాల రద్దుకు బెంగాల్‌ అసెంబ్లీ తీర్మానం

తాజా వార్తలు

Updated : 29/01/2021 12:45 IST

సాగుచట్టాల రద్దుకు బెంగాల్‌ అసెంబ్లీ తీర్మానం

కోల్‌కతా: కేంద్ర నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సభలో రసాభాస నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా సభ్యులంతా వెల్‌ వద్దకు దూసుకెళ్లడంతో సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కేంద్ర వ్యవసాయ చట్టాలపై తృణమూల్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని పలువురు భాజపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. అనంతరం ‘జైశ్రీరామ్‌’ అంటూ నినాదాలిస్తూ.. సభ నుంచి వాకౌట్‌ చేశారు.

తీర్మానంపై సభలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘కేంద్ర వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. రైతుల్ని దేశద్రోహులుగా ముద్రించడాన్ని మేం ఎప్పటికీ అంగీకరించం. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి. వ్యవసాయ చట్టాలను పూర్తిగా కేంద్రం రద్దు చేయాలి. లేదంటే అధికారం నుంచి వైదొలగాలి’ అని మమతా బెనర్జీ డిమాండు చేశారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవాన జరిగిన హింసాత్మక ఘటనలపై స్పందిస్తూ.. ఆ ఘటన పూర్తిగా ఇంటెలిజెన్స్‌ వైఫల్యంగా పేర్కొన్నారు. పరిస్థితి చేజారి పోవడానికి పూర్తి బాధ్యత పోలీసులదేనని ఆరోపించారు. 

ఇదీ చదవండి

ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని