Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175819
            [news_title_telugu_html] => 

ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రచారానికి 370 సభలు

[news_title_telugu] => ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రచారానికి 370 సభలు [news_title_english] => [news_short_description] => ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూకశ్మీర్‌కు జరగబోయే ప్రయోజనం గురించి పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని భాజపా అధినాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రచారానికి 370 సభలు - EENADU
close
ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రచారానికి 370 సభలు

  రెండు కమిటీలను నియమించిన భాజపా
  సహ కన్వీనర్లుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ముళీధర్‌రావు, సత్యకుమార్‌

ఈనాడు, దిల్లీ: ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూకశ్మీర్‌కు జరగబోయే ప్రయోజనం గురించి పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని భాజపా అధినాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 2 వేల మంది ప్రముఖులతో భేటీ కావడానికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నేతృత్వంలో ఒక కమిటీ, 370 చోట్ల సభలు నిర్వహించడానికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేసింది. తొలి కమిటీకి కో-కన్వీనర్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నేత పి.మురళీధర్‌రావు, రెండో కమిటీ కో-కన్వీనర్‌గా జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేత సత్యకుమార్‌ను నియమించింది. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఈ ప్రచార కార్యక్రమాల నిర్వహణ పూర్తి బాధ్యత వీరిదే. రెండు వేలమందితో సమావేశమయ్యే కమిటీ సభ్యులుగా కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌, ఎంపీలు రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌, అధికార ప్రతినిధి గౌరవ్‌భాటియా, సభల ఏర్పాటు కమిటీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషి, లద్దాఖ్‌ ఎంపీ జామ్యాంగ్‌ సేరింగ్‌ నామ్‌గ్యాల్‌, బెంగళూరు ఎంపీ తేజశ్వి సూర్య, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పాండాలు సభ్యులుగా ఉంటారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.