Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 131966
            [news_title_telugu_html] => 

టీ.కాంగ్రెస్‌ తీరుపై వీహెచ్‌ అసంతృప్తి

[news_title_telugu] => టీ.కాంగ్రెస్‌ తీరుపై వీహెచ్‌ అసంతృప్తి [news_title_english] => [news_short_description] => సొంత పార్టీ నాయకత్వంపై ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ మల్లు భట్టివిక్రమార్క ఆమరణ నిరాహార [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/J4GR6QfgxyM [news_videoinfo] => |https://www.youtube.com/embed/J4GR6QfgxyM [news_sections] => ,24,23, ) )
టీ.కాంగ్రెస్‌ తీరుపై వీహెచ్‌ అసంతృప్తి - EENADU
close
టీ.కాంగ్రెస్‌ తీరుపై వీహెచ్‌ అసంతృప్తి

 భట్టి దీక్షతో తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని విమర్శ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సొంత పార్టీ నాయకత్వంపై ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ మల్లు భట్టివిక్రమార్క ఆమరణ నిరాహార దీక్షను అడ్డం పెట్టుకుని తమ తప్పులను కప్పి పుచ్చుకోవాలని చూస్తోందన్నారు. భట్టివిక్రమార్క దీక్ష ఏఐసీసీకి పట్టదా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ పేరు చెప్పి రాష్ట్ర నేతలే దీక్ష విరమింపచేశారని మండిపడ్డారు. మంగళవారం వీహెచ్‌ గాంధీభవన్‌లో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అనేకచోట్ల ఎంపీపీ స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నా భాజపాకు ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారంలో కేవీపీ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాహుల్‌గాంధీకి వివరించేందుకు 5నెలలుగా ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే దిల్లీ వెళ్లి మరోసారి ప్రయత్నిస్తానని తెలిపారు. ఆయనకు చెప్పే అవకాశందక్కని పక్షంలో మీడియా ఎదుట తెలంగాణ కాంగ్రెస్‌ తప్పిదాలు బయటపెడతానని  హెచ్చరించారు. తెలంగాణకు కిరణ్‌బేడీని గవర్నర్‌గా నియమించాలని కేంద్ర మంత్రి అమిత్‌షాకు వీహెచ్‌ విజ్ఞప్తి చేశారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.