తాప్సీ

తాప్సీ

1/25

విషయం ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా తన మనసులోని మాటను ధైర్యం చెప్పగలిగే ముక్కుసూటి మనస్తత్వం ఉన్న హీరోయిన్‌ తాప్సీ పన్ను.

2/25

1987 ఆగస్టు 1న న్యూదిల్లీలో ఆమె జన్మించారు.

3/25

బి.టెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) అభ్యసించిన తాప్సీ కొన్నిరోజులపాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు.

4/25

కాలేజీ రోజుల నుంచే ఆమెకు మోడలింగ్‌పై ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్‌ మొదలుపెట్టింది ఈ భామ.

5/25

మోడల్‌గా రాణిస్తున్న తరుణంలో ఓ రేడియో ఛానల్‌కు వాణిజ్య ప్రకటనకర్తగా వ్యవహరించారు. అప్పట్లో ఆ యాడ్‌ సూపర్‌హిట్‌ అయ్యింది.

6/25

తాప్సీ కథానాయికగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘ఝుమ్మంది నాదం’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంతో 2010లో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

7/25

కేవలం గ్లామర్‌ పాత్రలు మాత్రమే కాకుండా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లోనూ ఆమె నటించి మెప్పించారు.

8/25

‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘దరువు’, ‘గుండెల్లో గోదారి’, ‘పింక్‌’, ‘గేమ్‌ ఓవర్‌’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘తప్పడ్‌’ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

9/25

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇటీవల విడుదలైన ‘హసీనా దిల్‌రుబా’లో తాప్సీ కీలకపాత్ర పోషించింది.

10/25

ప్రస్తుతం ఆమె చేతిలో ‘రష్మీ రాకెట్‌’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, ‘బ్లర్’, ‘ఏలియన్‌’, ‘దోబారా’ చిత్రాలున్నాయి.

11/25

‘‘అమ్మవాళ్ల దగ్గర నేను ఏ విషయాన్నీ దాచలేదు. మోడలింగ్‌ చేస్తున్నప్పుడు నటించే అవకాశం వచ్చింది. వెంటనే అమ్మతో ఆ విషయాన్ని చెప్పాను. ఆమె ఓకే అన్నారు. కానీ నాన్నకు ఆ విషయాన్ని చెప్పడానికి ఎంతో కష్టపడ్డాను. ఆయన్ని ఒప్పించడానికి బాత్రూమ్‌లో రిహార్సిల్స్‌ కూడా చేశా’’

12/25

‘‘మంచు మనోజ్‌, రానా, లక్ష్మి నాకు మంచి స్నేహితులు. ఏదైనా షూటింగ్‌ పనిమీద హైదరాబాద్‌కు వస్తే తప్పకుండా లక్ష్మిని కలుస్తాను. ఆమెతో ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాను. ఇక, రానా అయితే నా లక్కీ కోస్టార్‌. ఎందుకంటే మేమిద్దరం కలిసి నటించిన ‘ఆరంభం’ (తమిళం), బేబీ (హిందీ), ఘాజీ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి’’

13/25

‘‘ఒకే తరహా పాత్రల్లో నటించడమంటే నాకు ఇష్టం ఉండదు. ఒక నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధమే. గ్లామర్‌ రోల్స్‌ మాత్రమే కాకుండా విభిన్న కథా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల’’

14/25

‘‘ఫిట్‌నెస్‌ విషయంలో నేను ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటాను. తరచూ వర్కౌట్లు చేస్తుంటాను’’

15/25

‘‘షూటింగ్స్‌ నుంచి ఏ చిన్న గ్యాప్‌ దొరికినా సరే వెంటనే బ్యాగ్‌ సర్దేసుకుంటాను. ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి.. కొన్ని రోజులపాటు సరదాగా గడిపి వచ్చేస్తుంటాను. ఎందుకంటే నాకు ట్రావెలింగ్‌ అంటే ఎంతో ఇష్టం’’

16/25

‘‘మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడతాను. ‘గుండెల్లో గోదారి’ సినిమా షూట్‌ గోదావరి ప్రాంతాల్లో జరిగింది. దాంతో లక్ష్మి నాకు రోజుకోరకం చేపల వంటకం రుచి చూపించేది. నిజం చెప్పాలంటే నాకు చేపల వాసన పడదు. చికెన్‌ అంటే నాకెంతో ఇష్టం. అలాగే ఇడ్లీ సాంబార్‌ అంటే నాకెంతో ఇష్టం’’

17/25

తాప్సీ

18/25

తాప్సీ

19/25

తాప్సీ

20/25

తాప్సీ

21/25

తాప్సీ

22/25

తాప్సీ

23/25

తాప్సీ

24/25

తాప్సీ

25/25

తాప్సీ


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని