News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 21 May 2022 20:06 IST
1/22
వివిధ దేశాల పర్యటన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో దిగిన రామ్‌నాథ్‌ కోవింద్‌, సవితా కోవింద్‌ దంపతులకు జర్మనీలో భారత రాయభారి హరీశ్‌ పర్వతనేని, నందిత పర్వతనేని దంపతులు స్వాగతం పలికారు. వివిధ దేశాల పర్యటన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో దిగిన రామ్‌నాథ్‌ కోవింద్‌, సవితా కోవింద్‌ దంపతులకు జర్మనీలో భారత రాయభారి హరీశ్‌ పర్వతనేని, నందిత పర్వతనేని దంపతులు స్వాగతం పలికారు.
2/22
3/22
వరల్డ్ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు జురెక్‌ విమానాశ్రయంలో మంత్రి అమర్‌నాథ్‌, ఎంపీ మిథున్‌రెడ్డి, భారత ఎంబసీ అధికారులు స్వాగతం పలికారు. మే 22 నుంచి 26వరకు డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు జరగనుంది. వరల్డ్ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు జురెక్‌ విమానాశ్రయంలో మంత్రి అమర్‌నాథ్‌, ఎంపీ మిథున్‌రెడ్డి, భారత ఎంబసీ అధికారులు స్వాగతం పలికారు. మే 22 నుంచి 26వరకు డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు జరగనుంది.
4/22
ఇదేంటి.. ఈ నీరు నీలి, నలుపు రంగులోకి మారిపోయింది అనుకుంటున్నారా. హైదరాబాద్‌ నగర శివారులోని జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు సమీపంలో ఉన్న జవహర్‌ నగర్‌ చెరువు(కుంట) వద్ద ఈ పరిస్థితి నెలకొంది. డంపింగ్‌ యార్డు శుద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. రసాయన వ్యర్థాలు కలవడంతో దీన్ని ఆనుకున్న చెరువు, సమీప ప్రాంతాల్లోని భూగర్భజలాలు కలుషితమయ్యాయి. సమీప గ్రామాల్లో బోరు వేస్తే నీరు చమురును తలపించేలా పచ్చని రంగులో వస్తోంది. ఇదేంటి.. ఈ నీరు నీలి, నలుపు రంగులోకి మారిపోయింది అనుకుంటున్నారా. హైదరాబాద్‌ నగర శివారులోని జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు సమీపంలో ఉన్న జవహర్‌ నగర్‌ చెరువు(కుంట) వద్ద ఈ పరిస్థితి నెలకొంది. డంపింగ్‌ యార్డు శుద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. రసాయన వ్యర్థాలు కలవడంతో దీన్ని ఆనుకున్న చెరువు, సమీప ప్రాంతాల్లోని భూగర్భజలాలు కలుషితమయ్యాయి. సమీప గ్రామాల్లో బోరు వేస్తే నీరు చమురును తలపించేలా పచ్చని రంగులో వస్తోంది.
5/22
6/22
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో శనివారం 108సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కవిత, ఎల్‌ రమణ, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో శనివారం 108సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కవిత, ఎల్‌ రమణ, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
7/22
8/22
9/22
కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్‌ ఫ్రాన్స్‌ చేరుకున్నారు. ఫ్రాన్స్‌లో భారత రాయబారి జావెద్‌ అష్రఫ్‌ ఆయనకు స్వాగతం పలికారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్‌ ఫ్రాన్స్‌ చేరుకున్నారు. ఫ్రాన్స్‌లో భారత రాయబారి జావెద్‌ అష్రఫ్‌ ఆయనకు స్వాగతం పలికారు.
10/22
ధ్వని కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ నెల 15వ తేదీ నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి బస్సులు, లారీలు, ఇతర వాహనాలకు అదనంగా బిగించుకున్న హారన్లను తొలగించారు. సంబంధిత వాహనదారులకు చలాన్లు విధించారు. తొలగించిన హారన్లను గోషామహల్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్ కేంద్రంలో ఇలా ప్రదర్శనకు ఉంచారు. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ నెల 15వ తేదీ నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి బస్సులు, లారీలు, ఇతర వాహనాలకు అదనంగా బిగించుకున్న హారన్లను తొలగించారు. సంబంధిత వాహనదారులకు చలాన్లు విధించారు. తొలగించిన హారన్లను గోషామహల్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్ కేంద్రంలో ఇలా ప్రదర్శనకు ఉంచారు.
11/22
12/22
ఆచార్య జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేటలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ గురించి వారికి వివరించారు. ఆచార్య జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేటలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ గురించి వారికి వివరించారు.
13/22
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం డెఫిలింపిక్స్‌ విజేతలను కలిసి వారితో ముచ్చటించారు. దేశానికి ఖ్యాతి తెచ్చారని వారిని ప్రశంసించారు. పలువురు అథ్లెట్లు తమ విజయానుభూతిని ప్రధానితో పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం డెఫిలింపిక్స్‌ విజేతలను కలిసి వారితో ముచ్చటించారు. దేశానికి ఖ్యాతి తెచ్చారని వారిని ప్రశంసించారు. పలువురు అథ్లెట్లు తమ విజయానుభూతిని ప్రధానితో పంచుకున్నారు.
14/22
15/22
ఎంపీ సంతోశ్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ‘సమ్మతమే’ చిత్ర బృందం శనివారం మొక్కలు నాటింది. కార్యక్రమంలో సినిమా హీరో కిరణ్‌ అబ్బవరం, కథానాయిక చాందినీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ సంతోశ్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ‘సమ్మతమే’ చిత్ర బృందం శనివారం మొక్కలు నాటింది. కార్యక్రమంలో సినిమా హీరో కిరణ్‌ అబ్బవరం, కథానాయిక చాందినీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
16/22
17/22
దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు.
18/22
19/22
దక్షిణ కొరియాలో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ కప్‌ పోటీల్లో భారత్‌కు చెందిన అభిషేక్‌ వర్మ, అమన్‌ సైనీ, రజత్‌ చౌహాన్‌లు కంపౌండ్‌ మెన్స్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. గెలుపు అనంతరం ఇలా పుష్ప సినిమాలో ‘తగ్గేదేలే’ సీన్‌ను అనుకరించి సందడి చేశారు. దక్షిణ కొరియాలో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ కప్‌ పోటీల్లో భారత్‌కు చెందిన అభిషేక్‌ వర్మ, అమన్‌ సైనీ, రజత్‌ చౌహాన్‌లు కంపౌండ్‌ మెన్స్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. గెలుపు అనంతరం ఇలా పుష్ప సినిమాలో ‘తగ్గేదేలే’ సీన్‌ను అనుకరించి సందడి చేశారు.
20/22
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్‌ లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు, మాట్లాడేందుకు పలువురు ఎగబడ్డారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్‌ లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు, మాట్లాడేందుకు పలువురు ఎగబడ్డారు.
21/22
సోమాజీగూడలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో శనివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌, రాములు నాయక్‌ తదితరులు నివాళి అర్పించారు. దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. సోమాజీగూడలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో శనివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌, రాములు నాయక్‌ తదితరులు నివాళి అర్పించారు. దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.
22/22

మరిన్ని