News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 18 May 2022 06:39 IST
1/21
రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఎ.జి.పేరరివాళన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఇప్పటికే బెయిల్‌పై బయట ఉన్న పేరరివాళన్‌ తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన విడుదల కోసం చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజీవ్‌ హత్య కేసులో పేరరివాళన్‌ 30ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించాడు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఎ.జి.పేరరివాళన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఇప్పటికే బెయిల్‌పై బయట ఉన్న పేరరివాళన్‌ తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన విడుదల కోసం చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజీవ్‌ హత్య కేసులో పేరరివాళన్‌ 30ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించాడు.
2/21
తమిళ సినీ నటుడు విజయ్‌ బుధవారం దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్‌ని సీఎం శాలువాతో సత్కరించి సరదాగా ముచ్చటించారు. కార్యక్రమంలో ఎంపీ సంతోశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తమిళ సినీ నటుడు విజయ్‌ బుధవారం దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్‌ని సీఎం శాలువాతో సత్కరించి సరదాగా ముచ్చటించారు. కార్యక్రమంలో ఎంపీ సంతోశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
3/21
4/21
వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
5/21
బుధవారం ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయి. దీంతో సికింద్రాబాద్‌లోని ఓ పరీక్షకేంద్రం వద్ద విద్యార్థిని.. పరీక్షలు బాగా రాశానని ఉత్సాహంగా పరుగెత్తుకు వచ్చి తన స్నేహితురాలిని ఆలింగనం చేసుకుంది. బుధవారం ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయి. దీంతో సికింద్రాబాద్‌లోని ఓ పరీక్షకేంద్రం వద్ద విద్యార్థిని.. పరీక్షలు బాగా రాశానని ఉత్సాహంగా పరుగెత్తుకు వచ్చి తన స్నేహితురాలిని ఆలింగనం చేసుకుంది.
6/21
ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిత్యావసర సరకులు, తదితరాలను పంపించారు. సరకులతో వెళ్తున్న నౌకను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిత్యావసర సరకులు, తదితరాలను పంపించారు. సరకులతో వెళ్తున్న నౌకను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
7/21
8/21
అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా తొలిసారి ఆసియా నుంచి తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.కేశవులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవమని ముఖ్యమంత్రి ఆయన్ను అభినందించారు. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా తొలిసారి ఆసియా నుంచి తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.కేశవులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవమని ముఖ్యమంత్రి ఆయన్ను అభినందించారు.
9/21
ఖైరతాబాద్‌లోని శ్రీనివాస నగర్‌ బస్తీలో నివసించే ప్రజలు చాలామంది దినసరి కూలీలుగా పనిచేస్తుంటారు. వేసవి సెలవులు కావడంతో వారి పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. దీంతో తల్లులకు సాయం చేసేందుకు చిన్నారులు సైతం ఇలా కుళాయి వద్ద నీటిని పట్టి మోసుకొస్తూ కనిపించారు. ఖైరతాబాద్‌లోని శ్రీనివాస నగర్‌ బస్తీలో నివసించే ప్రజలు చాలామంది దినసరి కూలీలుగా పనిచేస్తుంటారు. వేసవి సెలవులు కావడంతో వారి పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. దీంతో తల్లులకు సాయం చేసేందుకు చిన్నారులు సైతం ఇలా కుళాయి వద్ద నీటిని పట్టి మోసుకొస్తూ కనిపించారు.
10/21
నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులు శివఓబుల్‌రెడ్డి, మేధాశ్రీరెడ్డిలను ఆయన ఆశీర్వదించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులు శివఓబుల్‌రెడ్డి, మేధాశ్రీరెడ్డిలను ఆయన ఆశీర్వదించారు.
11/21
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను చూసేందుకు కడప విమానాశ్రయానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను చూసేందుకు కడప విమానాశ్రయానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
12/21
పద్మశ్రీ గ్రహీత సాలుమారద తిమ్మక్క గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను ఆశీర్వదించేందుకు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా మొక్క నాటి స్ఫూర్తి చాటారు. అనంతరం ప్రగతి భవన్‌కు వచ్చిన ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా సన్మానించారు. 111 ఏళ్ల వయసులోనూ తిమ్మక్క మొక్కలు నాటుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పద్మశ్రీ గ్రహీత సాలుమారద తిమ్మక్క గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను ఆశీర్వదించేందుకు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా మొక్క నాటి స్ఫూర్తి చాటారు. అనంతరం ప్రగతి భవన్‌కు వచ్చిన ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా సన్మానించారు. 111 ఏళ్ల వయసులోనూ తిమ్మక్క మొక్కలు నాటుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
13/21
14/21
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు 

పోగొట్టుకొని నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పై చిత్రంలో కన్పిస్తున్న వ్యక్తి పేరు సాషా హోరోఖివ్‌స్కై. మార్చి 22న అతనిపై ఓ 

సైనికుడు కాల్పులు జరుపగా చికిత్స చేసిన వైద్యులు పూర్తిగా దెబ్బతిన్న ఓ కాలును తొలగించారు. అప్పటి నుంచి తనకు ఇంకో కాలు 

లేదనే బాధ అతడ్ని తీవ్రంగా వేధిస్తోంది. దాంతో వైద్య సిబ్బంది ఇలా మిర్రర్‌ థెరపీ చేస్తున్నారు. అద్దంలో తన కాలు ప్రతిబింబం 

చూసుకొంటూ బాధితుడు కాస్త సాంత్వన పొందుతున్నాడు. 
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు పోగొట్టుకొని నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పై చిత్రంలో కన్పిస్తున్న వ్యక్తి పేరు సాషా హోరోఖివ్‌స్కై. మార్చి 22న అతనిపై ఓ సైనికుడు కాల్పులు జరుపగా చికిత్స చేసిన వైద్యులు పూర్తిగా దెబ్బతిన్న ఓ కాలును తొలగించారు. అప్పటి నుంచి తనకు ఇంకో కాలు లేదనే బాధ అతడ్ని తీవ్రంగా వేధిస్తోంది. దాంతో వైద్య సిబ్బంది ఇలా మిర్రర్‌ థెరపీ చేస్తున్నారు. అద్దంలో తన కాలు ప్రతిబింబం చూసుకొంటూ బాధితుడు కాస్త సాంత్వన పొందుతున్నాడు.
15/21
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే తళుక్కున మెరిశారు. నలుపు, పసిడి కలగలిసిన చీరకట్టులో 

రెడ్‌ కార్పెట్‌పై హొయలుపోయారు. పాత సినిమా హీరోయిన్‌లా సింగారించుకున్న ఆమె లుక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపిక ధరించిన 

చీరను డిజైనర్ సవ్యసాచి రూపొందించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే తళుక్కున మెరిశారు. నలుపు, పసిడి కలగలిసిన చీరకట్టులో రెడ్‌ కార్పెట్‌పై హొయలుపోయారు. పాత సినిమా హీరోయిన్‌లా సింగారించుకున్న ఆమె లుక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపిక ధరించిన చీరను డిజైనర్ సవ్యసాచి రూపొందించారు.
16/21
తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీ పర్యటనలు చేపట్టిన తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 

లండన్‌ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నివాసం ఉంటున్న తెలంగాణ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీ పర్యటనలు చేపట్టిన తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లండన్‌ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నివాసం ఉంటున్న తెలంగాణ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
17/21
తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ముగింపు సందర్భంగా బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం.. భారీగా 

తరలివచ్చిన భక్తజనం తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ముగింపు సందర్భంగా బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం.. భారీగా తరలివచ్చిన భక్తజనం
18/21
19/21
ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్‌టీ వరకు నిర్మితమవుతున్న ఉక్కు వంతెన పనుల్లో భాగంగా పిల్లర్స్‌పై దిమ్మెలు అమర్చుతున్నారు. ఈ 

క్రమంలో వాటికి అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను మరో చోటుకు తరలిస్తున్నారు. అయితే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే 

కార్మికులు ఈ పనులు చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్ సుదర్శన్‌ థియేటర్ వద్ద కనిపించింది ఈ దృశ్యం. ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్‌టీ వరకు నిర్మితమవుతున్న ఉక్కు వంతెన పనుల్లో భాగంగా పిల్లర్స్‌పై దిమ్మెలు అమర్చుతున్నారు. ఈ క్రమంలో వాటికి అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను మరో చోటుకు తరలిస్తున్నారు. అయితే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే కార్మికులు ఈ పనులు చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్ సుదర్శన్‌ థియేటర్ వద్ద కనిపించింది ఈ దృశ్యం.
20/21
పెరిగిన ఇంధన ధరల కారణంగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయి. దీంతో ఓ మహిళ తన ద్విచక్ర వాహనంపైనే పరిమితికి మించి 

కూరగాయలు, ఇతర సామగ్రి వేసుకొని తీసుకెళ్తున్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద కనిపించింది ఈ దృశ్యం.
పెరిగిన ఇంధన ధరల కారణంగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయి. దీంతో ఓ మహిళ తన ద్విచక్ర వాహనంపైనే పరిమితికి మించి కూరగాయలు, ఇతర సామగ్రి వేసుకొని తీసుకెళ్తున్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద కనిపించింది ఈ దృశ్యం.
21/21
వాహనాల రద్దీ ఉండదని ఉదయాన్నే ట్యాంక్‌బండ్‌పై వేగంగా దూసుకెళ్తున్నారా?అయితే మీకు చలానా తప్పదు. ఉదయం ఏడు గంటల 

నుంచే ఇక్కడ లేజర్‌ స్పీడ్‌ గన్‌ల సహాయంతో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలపై నిఘా పెట్టారు. వాహనాల రద్దీ ఉండదని ఉదయాన్నే ట్యాంక్‌బండ్‌పై వేగంగా దూసుకెళ్తున్నారా?అయితే మీకు చలానా తప్పదు. ఉదయం ఏడు గంటల నుంచే ఇక్కడ లేజర్‌ స్పీడ్‌ గన్‌ల సహాయంతో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలపై నిఘా పెట్టారు.

మరిన్ని