News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 18 May 2022 01:53 IST
1/20
మార్కెట్‌లో రోజురోజుకు పెరుగుతున్న పోటీ వాతావరణానికి తగ్గట్లు యజమానులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వినియోగదారులను 

మెప్పించేలా కొత్త విధానాలతో ముందుకెళ్తున్నారు. అచ్చంగా ఇది కూడా అలాంటిదే. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన సుమన్‌ జైలు 

నమూనాతో ఆర్‌ఆర్‌ చౌరస్తాలో హోటల్‌ను ప్రారంభించారు. ఇనుప చువ్వలతో కూడిన గదులు, బొమ్మ తుపాకులు, బేడీలు ఏర్పాటు 

చేశారు. ‘ఆహారప్రియులను ఆకట్టుకోవడంతో పాటు వారికి కొత్త అనుభూతి అందించడానికి ఈ విధంగా ప్రయత్నించామని’ ఆయన 

తెలిపారు. మార్కెట్‌లో రోజురోజుకు పెరుగుతున్న పోటీ వాతావరణానికి తగ్గట్లు యజమానులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వినియోగదారులను మెప్పించేలా కొత్త విధానాలతో ముందుకెళ్తున్నారు. అచ్చంగా ఇది కూడా అలాంటిదే. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన సుమన్‌ జైలు నమూనాతో ఆర్‌ఆర్‌ చౌరస్తాలో హోటల్‌ను ప్రారంభించారు. ఇనుప చువ్వలతో కూడిన గదులు, బొమ్మ తుపాకులు, బేడీలు ఏర్పాటు చేశారు. ‘ఆహారప్రియులను ఆకట్టుకోవడంతో పాటు వారికి కొత్త అనుభూతి అందించడానికి ఈ విధంగా ప్రయత్నించామని’ ఆయన తెలిపారు.
2/20
ఒంగోలు- కావలి బస్సులో మంగళవారం ఒక కోతి హల్‌చల్‌ చేసింది. ఒంగోలులో ప్రయాణికులతోపాటు బస్సులోకి ఎక్కిన కోతి డ్రైవర్‌ 

పక్కనే ఆశీనురాలైంది. ఏదో ఒక స్టేజీ వద్ద బస్సు నిలిపినప్పుడు దిగిపోతుందిలే అనుకుని డ్రైవర్‌ ఉలవపాడు వరకూ వచ్చారు. బస్సు 

నిలిపినచోట దాన్ని తరిమితే పైపైకి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. దీంతో డ్రైవర్‌ ఉలవపాడులో బస్సును నిలిపి ప్రయాణికుల సాయంతో 

అరటికాయలు పెట్టి కోతిని సాగనంపారు. ఒంగోలు- కావలి బస్సులో మంగళవారం ఒక కోతి హల్‌చల్‌ చేసింది. ఒంగోలులో ప్రయాణికులతోపాటు బస్సులోకి ఎక్కిన కోతి డ్రైవర్‌ పక్కనే ఆశీనురాలైంది. ఏదో ఒక స్టేజీ వద్ద బస్సు నిలిపినప్పుడు దిగిపోతుందిలే అనుకుని డ్రైవర్‌ ఉలవపాడు వరకూ వచ్చారు. బస్సు నిలిపినచోట దాన్ని తరిమితే పైపైకి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. దీంతో డ్రైవర్‌ ఉలవపాడులో బస్సును నిలిపి ప్రయాణికుల సాయంతో అరటికాయలు పెట్టి కోతిని సాగనంపారు.
3/20
అసలే వేసవి కాలం.. అంతలోనే అకాల వర్షం.. ఆపై నేను సైతం అంటూ మంచు కురిసి మురిపిస్తోంది. శాంతిపురంలో సోమవారం రాత్రి 

మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారు జామున మంచు కురిసింది. ఉదయం 7:30 గంటల వరకు మంచు కురవడంతో.. 

ఇంతకీ మనం ఏకాలంలో ఉన్నామంటూ.. ఒకింత ఆశ్చర్యపోవడం జనం వంతైంది. జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు వల్ల 

వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే వేసవి కాలం.. అంతలోనే అకాల వర్షం.. ఆపై నేను సైతం అంటూ మంచు కురిసి మురిపిస్తోంది. శాంతిపురంలో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారు జామున మంచు కురిసింది. ఉదయం 7:30 గంటల వరకు మంచు కురవడంతో.. ఇంతకీ మనం ఏకాలంలో ఉన్నామంటూ.. ఒకింత ఆశ్చర్యపోవడం జనం వంతైంది. జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు వల్ల వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
4/20
పున్నమి వెన్నెల్లో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సమీపంలోని కైలాసగిరులు మంగళవారం కాంతులీనాయి. ఈ ఆహ్లాదకర దృశ్యం భక్త కోటిని 

కనువిందు చేసింది.  పున్నమి వెన్నెల్లో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సమీపంలోని కైలాసగిరులు మంగళవారం కాంతులీనాయి. ఈ ఆహ్లాదకర దృశ్యం భక్త కోటిని కనువిందు చేసింది.
5/20
చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన పండుగ గంగమ్మ జాతర జరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చిత్తూరు నగరంతో పాటు పక్కనున్న 

నియోజకవర్గాల్లో పనిచేస్తున్న సచివాలయ మహిళా పోలీసులను చిత్తూరు నగరంలో జరుగుతున్న గంగమ్మ జాతర ప్రాంతాలకు పంపారు. 

అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతో నిల్చోని వచ్చి వెళ్లే భక్తులకు దిశ యాప్‌ డౌన్‌లోడు చేయాలని, దీనితో పాటు ఒక్కో 

సిబ్బంది 100 మంది ప్రజలకు యాప్‌ వేసేలా సంబంధిత పోలీసు అధికారులు వారికి టార్గెట్లు ఇచ్చారు. యాప్‌ వేస్తున్నట్లు ఫొటోలు తీసి 

వాటిని తమ గ్రూపులకు పంపాలనే నిబంధన సైతం ఉంది. దీంతో వచ్చి వెళ్లే భక్తులను అక్కా..అమ్మా..అన్నా.. తమ్ముడు ‘దిశా యాప్‌ 

ఉందా’ అంటూ.. తమ లక్ష్యాలు పూర్తి చేసేందుకు నానా తంటాలు పడ్డారు ఆ మహిళా పోలీసులు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన పండుగ గంగమ్మ జాతర జరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చిత్తూరు నగరంతో పాటు పక్కనున్న నియోజకవర్గాల్లో పనిచేస్తున్న సచివాలయ మహిళా పోలీసులను చిత్తూరు నగరంలో జరుగుతున్న గంగమ్మ జాతర ప్రాంతాలకు పంపారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతో నిల్చోని వచ్చి వెళ్లే భక్తులకు దిశ యాప్‌ డౌన్‌లోడు చేయాలని, దీనితో పాటు ఒక్కో సిబ్బంది 100 మంది ప్రజలకు యాప్‌ వేసేలా సంబంధిత పోలీసు అధికారులు వారికి టార్గెట్లు ఇచ్చారు. యాప్‌ వేస్తున్నట్లు ఫొటోలు తీసి వాటిని తమ గ్రూపులకు పంపాలనే నిబంధన సైతం ఉంది. దీంతో వచ్చి వెళ్లే భక్తులను అక్కా..అమ్మా..అన్నా.. తమ్ముడు ‘దిశా యాప్‌ ఉందా’ అంటూ.. తమ లక్ష్యాలు పూర్తి చేసేందుకు నానా తంటాలు పడ్డారు ఆ మహిళా పోలీసులు.
6/20
భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌  కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో  

పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీలు చేశారు. అదే సమయంలో సైకిల్‌ పై మోదీ ఫొటో, భాజపా 

జెండాలతో ఓ యువకుడు అటుగా రావడంతో అడ్డుకున్నారు. అతను ఏక్‌ భారత్‌..  శ్రేష్ఠ్‌ భారత్‌ నినాదంతో సైకిల్‌ యాత్ర చేస్తున్నాడని 

తెలుసుకుని విడిచిపెట్టారు.  భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీలు చేశారు. అదే సమయంలో సైకిల్‌ పై మోదీ ఫొటో, భాజపా జెండాలతో ఓ యువకుడు అటుగా రావడంతో అడ్డుకున్నారు. అతను ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ్‌ భారత్‌ నినాదంతో సైకిల్‌ యాత్ర చేస్తున్నాడని తెలుసుకుని విడిచిపెట్టారు.
7/20
పశ్చిమ గోదావరి జిల్లాతో కోనసీమ జిల్లాను కలిపే దిండి-చించినాడ వంతెనపై గోతులు ఏర్పడి, ఊచలు తేలాయి. రక్షణ గోడ 

ప్రమాదకరంగా ఉంది. తీర ప్రాంతాలను కలుపుతూ కృష్ణా జిల్లా పామర్రు నుంచి కాకినాడ జిల్లా కత్తిపూడి వరకూ నిర్మిస్తున్న 216 జాతీయ 

రహదారి పరిధిలో ఉందీ వంతెన. దీనిపై ఏఈ వి.అనుదీప్‌ మాట్లాడుతూ ఉన్నతాధికారులకు నివేదించామని త్వరలోనే పనులు 

చేపడతామన్నారు.  పశ్చిమ గోదావరి జిల్లాతో కోనసీమ జిల్లాను కలిపే దిండి-చించినాడ వంతెనపై గోతులు ఏర్పడి, ఊచలు తేలాయి. రక్షణ గోడ ప్రమాదకరంగా ఉంది. తీర ప్రాంతాలను కలుపుతూ కృష్ణా జిల్లా పామర్రు నుంచి కాకినాడ జిల్లా కత్తిపూడి వరకూ నిర్మిస్తున్న 216 జాతీయ రహదారి పరిధిలో ఉందీ వంతెన. దీనిపై ఏఈ వి.అనుదీప్‌ మాట్లాడుతూ ఉన్నతాధికారులకు నివేదించామని త్వరలోనే పనులు చేపడతామన్నారు.
8/20
అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల దృష్టిలో నిలిచే బీచ్‌లకు ‘బ్లూఫ్లాగ్‌’ గుర్తింపు ఇస్తుంటారు. గత ఏడాది ఆ ఘనత సాధించిన ‘రుషికొండ’ 

బీచ్‌ వద్ద వేడుకగా సాగిన పలు ప్రత్యేక కార్యక్రమాలు నగర వాసులను అలరించాయి. అలాంటి చోట...ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ 

హంగులు...సదుపాయాలు ఏమయ్యాయి? అనే ఆవేదన సందర్శకుల్లో వ్యక్తం అవుతోంది. గతంలోని సుందర తీరాన్ని ఊహించుకొని 

వచ్చిన వారు హతాశులవుతున్నారు. బీచ్‌ తీరమంతటా పారేసిన వస్త్రాలు కొట్టుకు రావడంతో ఓ డంపింగ్‌ యార్డులా మారిపోయింది. ఆ 

వస్త్రాల పీలికలు సాగర జలాల్లో మునిగిన వారి తలపైకి వచ్చినప్పుడు...నీళ్లల్లో కాళ్లకు చుట్టుకున్నప్పుడు  చెప్పలేనంత చీదర 

కలుగుతోందని పర్యాటకులు చెబుతున్నారు.   అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల దృష్టిలో నిలిచే బీచ్‌లకు ‘బ్లూఫ్లాగ్‌’ గుర్తింపు ఇస్తుంటారు. గత ఏడాది ఆ ఘనత సాధించిన ‘రుషికొండ’ బీచ్‌ వద్ద వేడుకగా సాగిన పలు ప్రత్యేక కార్యక్రమాలు నగర వాసులను అలరించాయి. అలాంటి చోట...ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ హంగులు...సదుపాయాలు ఏమయ్యాయి? అనే ఆవేదన సందర్శకుల్లో వ్యక్తం అవుతోంది. గతంలోని సుందర తీరాన్ని ఊహించుకొని వచ్చిన వారు హతాశులవుతున్నారు. బీచ్‌ తీరమంతటా పారేసిన వస్త్రాలు కొట్టుకు రావడంతో ఓ డంపింగ్‌ యార్డులా మారిపోయింది. ఆ వస్త్రాల పీలికలు సాగర జలాల్లో మునిగిన వారి తలపైకి వచ్చినప్పుడు...నీళ్లల్లో కాళ్లకు చుట్టుకున్నప్పుడు చెప్పలేనంత చీదర కలుగుతోందని పర్యాటకులు చెబుతున్నారు.
9/20
జిల్లా యంత్రాంగం సోమవారం  డెంగీ నివారణ దినాన్ని ఘనంగా నిర్వహించింది. మహబూబ్‌నగర్‌లో అవగాహనా ర్యాలీ నిర్వహించి, 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో 

పారిశుద్ధ్యంపై మాత్రం శ్రద్ధ పెట్టడంలేదు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జడ్చర్ల ప్రయాణ ప్రాంగణంలో నీరు నిలిచి పచ్చగా 

మారింది. అందులో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆ దృశ్యాన్ని ఈనాడు కెమెరా క్లిక్‌ మనిపించింది.


జిల్లా యంత్రాంగం సోమవారం డెంగీ నివారణ దినాన్ని ఘనంగా నిర్వహించింది. మహబూబ్‌నగర్‌లో అవగాహనా ర్యాలీ నిర్వహించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో పారిశుద్ధ్యంపై మాత్రం శ్రద్ధ పెట్టడంలేదు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జడ్చర్ల ప్రయాణ ప్రాంగణంలో నీరు నిలిచి పచ్చగా మారింది. అందులో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆ దృశ్యాన్ని ఈనాడు కెమెరా క్లిక్‌ మనిపించింది.
10/20
హుస్సేన్‌సాగర్‌ తీరాన, బిర్లా మందిరానికి చేరువలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన నూతన సచివాలయ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. అద్భుత హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ సువిశాల భవనంపై ప్రస్తుతం గుమ్మటాలను అమర్చే పనిపై ఇంజినీరింగ్‌ నిపుణులు దృష్టిసారించారు.. ఇటీవల నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా నాటికల్లా వాటిని పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు పనుల్లో జోరు పెంచారు. హుస్సేన్‌సాగర్‌ తీరాన, బిర్లా మందిరానికి చేరువలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన నూతన సచివాలయ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. అద్భుత హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ సువిశాల భవనంపై ప్రస్తుతం గుమ్మటాలను అమర్చే పనిపై ఇంజినీరింగ్‌ నిపుణులు దృష్టిసారించారు.. ఇటీవల నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా నాటికల్లా వాటిని పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు పనుల్లో జోరు పెంచారు.
11/20
దిల్లీలో మంగళవారం 61వ కేవల్రీ రెజిమెంట్‌ కర్నల్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే దిల్లీలో మంగళవారం 61వ కేవల్రీ రెజిమెంట్‌ కర్నల్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే
12/20
హైదరాబాద్‌లోని షేక్‌పేట నుంచి ఫిలింనగర్‌ ప్రధాన రహదారిపై డివైడర్ల మధ్యలో సుందరీకరణలో భాగంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వివిధ ఆకృతులను ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా ప్రారంభించకపోవడంతో వాటి ముసుగులు చిరిగి తొలగిపోతున్నాయి. మరోవైపు విరిగిపోయిన కత్తులతో ఆకృతులు రూపు కోల్పోతున్నాయి. హైదరాబాద్‌లోని షేక్‌పేట నుంచి ఫిలింనగర్‌ ప్రధాన రహదారిపై డివైడర్ల మధ్యలో సుందరీకరణలో భాగంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వివిధ ఆకృతులను ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా ప్రారంభించకపోవడంతో వాటి ముసుగులు చిరిగి తొలగిపోతున్నాయి. మరోవైపు విరిగిపోయిన కత్తులతో ఆకృతులు రూపు కోల్పోతున్నాయి.
13/20
14/20
15/20
రహదారిపై స్కేటింగ్‌ చేస్తున్న వీరు పలు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన          క్రీడాకారులు. చందానగర్‌లోని పీజేఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో స్కేటింగ్‌లో శిక్షణ పొందారు.           రెండేళ్లుగా స్టేడియంలో ట్రాక్‌ పాడవడం, ఉన్న దానిపై వేసవి శిక్షణ శిబిరాలు నడుస్తుండటంతో.. ఇలా అసంపూర్తిగా నిలిచిన శేరిలింగంపల్లి-చందానగర్‌ లింకు రహదారిపై రోజూ ఉదయం సాధన చేస్తున్నారు. తల్లిదండ్రులు, శిక్షకులు ఎన్నిసార్లు వినతులిచ్చినా అధికారులు ఇప్పటి వరకు ట్రాక్‌కు మరమ్మతులు చేయించలేదు. రహదారిపై స్కేటింగ్‌ చేస్తున్న వీరు పలు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు. చందానగర్‌లోని పీజేఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో స్కేటింగ్‌లో శిక్షణ పొందారు. రెండేళ్లుగా స్టేడియంలో ట్రాక్‌ పాడవడం, ఉన్న దానిపై వేసవి శిక్షణ శిబిరాలు నడుస్తుండటంతో.. ఇలా అసంపూర్తిగా నిలిచిన శేరిలింగంపల్లి-చందానగర్‌ లింకు రహదారిపై రోజూ ఉదయం సాధన చేస్తున్నారు. తల్లిదండ్రులు, శిక్షకులు ఎన్నిసార్లు వినతులిచ్చినా అధికారులు ఇప్పటి వరకు ట్రాక్‌కు మరమ్మతులు చేయించలేదు.
16/20
17/20
పసిపిల్లల వైద్యంలో పేదలకు పెద్దదిక్కుగా ఉన్న హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రిలో దైన్యమిది. ఆవరణలో మురుగు, వ్యర్థాల కుప్పల పక్కనే రోగుల బంధువులు సేద తీరుతున్నారు. పసిపిల్లల వైద్యంలో పేదలకు పెద్దదిక్కుగా ఉన్న హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రిలో దైన్యమిది. ఆవరణలో మురుగు, వ్యర్థాల కుప్పల పక్కనే రోగుల బంధువులు సేద తీరుతున్నారు.
18/20
ఎర్రటి ఎండ వేడికి మనుషులే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక నోరు లేని జీవుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఆవుల సంరక్షణకు వాటి యజమాని తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మూగజీవులపై గోనెపట్టాలు కప్పి చల్లటి నీళ్లతో తడిపి ఉపశమనం కల్పిస్తున్నాడు. చల్లదనం కోసం గంటకోసారి వాటిపై నీళ్లు చిమ్ముతున్నాడు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం పక్కన కనిపించిన చిత్రమిది. ఎర్రటి ఎండ వేడికి మనుషులే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక నోరు లేని జీవుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఆవుల సంరక్షణకు వాటి యజమాని తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మూగజీవులపై గోనెపట్టాలు కప్పి చల్లటి నీళ్లతో తడిపి ఉపశమనం కల్పిస్తున్నాడు. చల్లదనం కోసం గంటకోసారి వాటిపై నీళ్లు చిమ్ముతున్నాడు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం పక్కన కనిపించిన చిత్రమిది.
19/20
ఎండల వేళ.. హైదరాబాద్‌ విద్యానగర్‌ రోడ్డులోని ఓ ఆసుపత్రి ఆవరణలో విద్యుత్‌ నియంత్రిక ఫ్యూజ్‌ బాక్స్‌కు ఎక్కువ వేడి తగలకుండా కూలర్‌ ఏర్పాటుచేసిన చిత్రమిది. ఎండల వేళ.. హైదరాబాద్‌ విద్యానగర్‌ రోడ్డులోని ఓ ఆసుపత్రి ఆవరణలో విద్యుత్‌ నియంత్రిక ఫ్యూజ్‌ బాక్స్‌కు ఎక్కువ వేడి తగలకుండా కూలర్‌ ఏర్పాటుచేసిన చిత్రమిది.
20/20
ఎండలు మండుతున్న వేళ.. రోడ్డుపై నీడ కనిపిస్తే చాలు బాటసారులకు ఎంతో ఊరట. నగరంలోని బషీర్‌బాగ్‌ సర్కిల్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు రోడ్డు పక్కన చెట్టు నీడలో, ట్రాఫిక్‌ ఐలండ్‌లో తలదాచుకుంటున్నారు. ఎండలు మండుతున్న వేళ.. రోడ్డుపై నీడ కనిపిస్తే చాలు బాటసారులకు ఎంతో ఊరట. నగరంలోని బషీర్‌బాగ్‌ సర్కిల్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు రోడ్డు పక్కన చెట్టు నీడలో, ట్రాఫిక్‌ ఐలండ్‌లో తలదాచుకుంటున్నారు.

మరిన్ని