
తాజావార్తలు
లోక్‌సభలో వెల్లడించిన విదేశాంగశాఖ
దిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలకు భద్రత కల్పించే విధంగా అప్పటి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విదేశాల్లోని మహిళలు గృహహింస, వరకట్న వేధింపులు వంటి సమస్యలు ఎదుర్కుంటుంటే భర్తలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత నెల వరకు భారీగా ఫిర్యాదులు అందినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. లోక్‌సభా సమావేశాల్లో భాగంగా విదేశాంగశాఖకు ఎదురైన ప్రశ్నకు కేంద్ర సహాయ వి.మురళీధరన్ సమాధానమిచ్చారు.
‘2015 నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు ఆరువేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది అక్టోబరు చివరి నాటికి 991 ఫిర్యాదులు వచ్చాయి. 2018లో 1,299కేసులు నమోదైయ్యాయి. 2017లో 1,498 ఫిర్యాదులు, 2016లో 1,510, 2015లో 796 ఫిర్యాదులు అందాయి. గత మూడేళ్ల కాలంలో 77మంది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకున్నారు. వీరిలో 73 మంది భారత్‌కు తిరిగి రాగా, ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు ఇప్పటికీ చెరలోనే ఉన్నారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉపాధి, వలస నిమిత్తం కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్, యూఏఈ వెళ్లిన భారతీయుల్లో 2019 అక్టోబరు నాటికి 4,823 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018లో ఈ సంఖ్య 6,014గా ఉంది. 2017లో 5,906, 2016లో 6,013 మంది, 2015లో 5,786 మంది మృతి చెందారు’ అని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ