close

తాజావార్తలు

ఈ భారత ఐటీ కంపెనీలకు నో హెచ్‌-1బీ..!

దిల్లీ: అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తాజా నివేదిక ప్రకారం భారత ఐటీ కంపెనీలకు వీసా నిబంధనల్ని అమెరికా మరింత కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌సీఐఎస్ తాజా అధ్యయనం ప్రకారం పలు ఇండియన్ ఐటీ కంపెనీలను హెచ్‌-1బీ వీసాలు పొందే సంస్థల జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. ఇక ఆయా సంస్థలు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. తొలగించిన వాటి జాబితాలో అజిమెట్రీ ఇన్‌కార్పొరేషన్‌, బుల్‌మెన్‌ కన్సల్టెంట్‌ గ్రూప్‌ ఇన్‌కార్పొరేషన్‌, బిజినెస్‌ రిపోర్టింగ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ఇన్‌కార్పొరేషన్‌, నెటేజ్‌, కెవిన్‌ ఛాంబర్స్‌, ఇ-యాప్పైర్‌ ఐటీ ఎల్‌ఎల్‌సీ లాంటి తదితర కంపెనీలు ఉన్నట్లు సమాచారం.

హెచ్‌-1 బీ వీసా కోసం కొత్తగా చేసుకున్న దరఖాస్తులను గణనీయ సంఖ్యలో అమెరికా ప్రభుత్వం తిరస్కరించినట్లు యూఎస్‌సీఐఎస్ అధ్యయనం ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో (అక్టోబరు- జూన్‌) దాదాపు నాలుగొంతుల దరఖాస్తులను తిరస్కరించినట్లు సమచారం. 2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019లో తిరస్కరణకు గురైన దరఖాస్తులు మూడురెట్లు పెరిగాయి. హెచ్‌-1బీ వీసా కలిగి ఉన్న వారి సంఖ్యలో దాదాపు 70 శాతం భారతీయులే ఉంటుండటం గమనార్హం. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులను ఆమోదించే విషయంలో యూఎస్‌సీఐఎస్‌ ప్రమాణాలను మార్చుకోవడమే తిరస్కరణ రేటుకు, తాజా ఐటీ కంపెనీలకు వీసా నిరాకరించడానికి కారణంగా తెలుస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.