close

తాజావార్తలు

యూకేలో తొలి తెలుగు పుస్తక ప్రదర్శన

నవ సమాజ్‌ దర్పణ్‌ ఆధ్వర్యంలో నిర్వహణ

లండన్‌: బ్రిటన్‌లో తొలిసారి తెలుగు పుస్తక ప్రదర్శన జరిగింది. థరోక్‌ డివిజన్స్‌ గ్రేస్‌ లైబ్రరీలో యూకేకు చెందిన నవ సమాజ్‌ దర్పణ్‌ (ఎన్‌ఎస్‌డీ) స్వచ్ఛంద సంస్థ దీన్ని నిర్వహించింది. ఆగస్టు 24న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ ప్రదర్శన జరిగినట్లు నిర్వహకులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆధ్యాత్మిక పుస్తకాలు మొదలు పిల్లల పుస్తకాల వరకూ ఈ ప్రదర్శనలో ఉంచినట్లు వివరించారు. ఈ సమయంలో వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు వారు గ్రేస్‌ లైబ్రరీని సందర్శించారని పేర్కొన్నారు. ‘‘సందర్శనకు వచ్చిన తెలుగు వారి నుంచే కాక శ్రీలంక తమిళులు, బెంగాలీలు తదితరుల నుంచి ప్రదర్శనపై మంచి స్పందన వచ్చింది. తెలుగు పుస్తకాలను ఆంగ్లంలోకి అనువదించి అందించాలని కొంత మంది కోరుతున్నారు. నవ సమాజ్‌ దర్పణ్‌ ఆధ్వర్యంలో ధ్యానం తరగతులను కూడా యూకేలో నిర్వహించాలని ఓ బ్రిటీష్‌ వ్యక్తి కోరారు.
ఎన్‌ఎస్‌డీలో సభ్యత్వం పొందిన బ్రిటీష్‌ ఎన్నారైల పిల్లల కోసం త్వరలో తెలుగు పాఠాలు బోధించే అంశాన్ని పరిశీలించాం.’’ అని ప్రకటనలో వివరించారు.
ఆగస్టు 31న రెండోసారి పుస్తక ప్రదర్శన ఉంటుందని, ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌డీ వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభిస్తామని నిర్వహకులు వెల్లడించారు. ఎన్‌ఎస్‌డీ చేపట్టే కార్యక్రమాలన్నీ దీని ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.
పుస్తకాల ద్వారా స్వచ్ఛందంగా బ్రిటన్‌లో తెలుగు భాషాభివృద్ధికి ఎన్‌ఎస్‌డీ కృషి చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు పంజాల శ్రీకాంత్‌ గౌడ్‌ అన్నారు. భవిష్యత్తు తరాల వారి కోసం యూకేలో తెలుగు భాషను వ్యాప్తి చేసేందుకు ఆసక్తి ఉన్నవారు తమకు తోడ్పాటు అందించవచ్చని పిలుపునిచ్చారు. నవ తరం పిల్లలతో తెలుగు చదివించడం, రాయించడం సవాలుతో కూడుకున్న వ్యవహారం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రదర్శన కోసం అధిక సంఖ్యలో పుస్తకాలను సమకూర్చేందుకు సహకరించిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రామాచారికి ఎన్‌ఎస్‌డీ కృతజ్ఞతలు తెలిపింది. జ్ఞానం ఫౌండేషన్‌, థరోక్‌ లైబ్రరీ మేనేజర్‌ రోజలిన్‌ జోన్స్‌, గ్రేస్ లైబ్రరీ సూపర్‌వైజర్‌ జోసెఫ్‌ కూపర్‌కు పంజాల శ్రీకాంత్‌ గౌడ్‌ ధన్యవాదాలు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.