
తాజావార్తలు
వాషింగ్టన్ డీసీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ విందు ఇచ్చారు. భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు, 60 మందికిపైగా సీనియర్ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ నాయకత్వాన్ని భారత రాయబారి హర్షవర్ధన్ ప్రశంసించారు. సీఎం జగన్ సంకల్పం, స్థిరత్వం, పారదర్శక విధానాలు ఏపీని వ్యూహాత్మక మార్గంవైపు నడిపిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆయన అన్నారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికాలో భారత్ అధికారులు గట్టి పునాదులు వేశారని సీఎం జగన్ ప్రశంసించారు. రాష్ట్రంలో వ్యాపారాలకు, పెట్టుబడులకు కొత్త అవకాశాలున్నాయని వివరించారు. ఇవి ఏపీ, అమెరికాల మధ్య సంబంధాలను మరింత పెంచడమే కాకుండా, వ్యాపార, వాణిజ్య, ఇంధన రంగంలో సహకారం, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం భాగస్వామ్యాలకు దారితీస్తుందని ఆకాంక్షించారు. కావాల్సినంత మానవనరులు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- బాలయ్య సరసన రష్మి
- పీఎంవోలో అధికారాలు కేంద్రీకృతం
- అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన చిరు