గ్రామ ప్రజల కోసం నీటి శుద్ధియంత్రం ఏర్పాటు
గ్రామ ప్రజల కోసం నీటి శుద్ధియంత్రం ఏర్పాటు

ఖమ్మం‌: తమ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు  ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ప్రవాసాంధ్రులు ముందడుగు వేశారు. ఖమ్మం జిల్లాలోని మాటూరుపేటలో తానా, సామినేని వ్యాజ్జయ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుమారు రూ.6 లక్షల విలువచేసే నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. సామినేని నాగేశ్వరరావు-రాధమ్మ, సామినేని రవి-షర్మిల, రిశ్వంత్‌ చౌదరి, రితిన్‌ చౌదరిలు నీటిశుద్ధి యంత్రానికి ఆర్థిక సాయం చేశారు. ఫౌండేషన్‌ సభ్యులు సామినేని నాగేశ్వరరావు వారి సొంత స్థలంలో ఈ నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నెల్లూరు రవి, మాదల రామారావు, మాదల రాంబాబు, అన్నేమోహనరావు, గండ్ర నరసింహారావు, దొండపాటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Advertisement

Tags :

మరిన్ని