ఎల్లలు లేని ప్రపంచ చర్చావేదిక ‘వీధి అరుగు’ 
ఎల్లలు లేని ప్రపంచ చర్చావేదిక ‘వీధి అరుగు’  

నార్వేలో ఘనంగా ప్రారంభోత్సవం

నార్వే: పలు దేశాల్లో ఉన్న తెలుగువారి ఆధ్వర్యంలో జనవరి 31న ‘వీధి అరుగు’ పేరిట చేపట్టిన చర్చా వేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది. వర్చువల్‌ పద్ధతిలో దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ సభకు నార్వేలోని భారత రాయబారి బాలభాస్కర్‌, ప్రముఖ అవధాని, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ‘వీధి అరుగు’ విశిష్టతను తెలియజేసేలా నార్వే, 16 దేశాల ప్రవాస తెలుగువారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నార్వేలోని భారత రాయబారి డాక్టర్‌ బి.బాల భాస్కర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలుగు భాషా సంస్కృతిలో ఒక ప్రముఖ స్థానం ఉన్న ‘వీధి అరుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించడం గొప్ప ఆలోచన.దీని ద్వారా భాషా మరియు విజ్ఞానాన్ని ముందు తరాలకు అందిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. 

అనంతరం ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన ఉపన్యాసం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ‘వీధి అరుగు’ విశిష్టత, నార్వేలోని శాంతమయ జీవితం, జీవిత పరమార్థం, పితృవర్యుల గొప్పతనం, ప్రపంచ పటంలో తెలుగువాడి స్థానం, తెలుగు భాష గొప్పదనం, తెలుగు చరిత్రలోని ప్రముఖుల జీవితాలు నుంచి నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు.. ఇలా ఎన్నో అంశాలతో ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిబద్ధతతో కొనసాగిస్తామని నిర్వహకులు సభాముఖంగా తెలియజేస్తూ వందన సమర్పన చేశారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని