భారతీయ మహిళకు ఐరాస ఉన్నత పదవి
భారతీయ మహిళకు ఐరాస ఉన్నత పదవి

ఐరాస: భారత దేశానికి చెందిన పెట్టుబడుల నిపుణురాలు ఉషారావు మొనారీని ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం’ (యూఎన్‌డీపీ)లో అండర్‌ సెక్రటరీ జనరల్‌గా, సహాయ పరిపాలకురాలిగా నియమిస్తూ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పెట్టుబడుల్లో, ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంపై ఆమెకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. బ్లాక్‌స్టోన్‌ గ్రూపులో ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు.


మరిన్ని