దేశీయ నైపుణ్య విద్యాసంస్థలకు విదేశాల్లోనూ క్యాంపస్‌లు
దేశీయ నైపుణ్య విద్యాసంస్థలకు విదేశాల్లోనూ క్యాంపస్‌లు

యూజీసీ తాజా మార్గదర్శకాలు

దిల్లీ: దేశంలో నైపుణ్య సంస్థల (ఐవోఈ) హోదా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీలు తమ ప్రాంగణాలను (క్యాంపస్‌లను) ఇకపై విదేశాల్లోనూ నెలకొల్పుకోవచ్చు. ఈ వెసులుబాటు కల్పిస్తూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తి ఉండేలా 20 విద్యాసంస్థల్ని ఎంపిక చేస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2018లో ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం విదేశీ విద్యాలయాలు మన దేశంలో, మనదేశంలోని అగ్రగణ్య సంస్థలు విదేశాల్లో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఐవోఈలు ఐదేళ్లలో గరిష్ఠంగా మూడు ప్రాంగణాలను వేరేచోట నెలకొల్పుకోవచ్చు. దీనికి విద్యాశాఖతో పాటు హోం, విదేశీ వ్యవహారాల శాఖల అనుమతులు అవసరం.

ఇవీ చదవండి..

ఆమె గర్వించదగిన భారత పుత్రి

హెచ్‌1బి: మారుతున్న ఎంపిక ప్రక్రియ 

Advertisement

Advertisement


మరిన్ని