యూకేలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
యూకేలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ఇంటర్నెట్‌డెస్క్‌: బర్మింగ్‌హామ్‌లోని ప్రవాస తెలుగువారు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరోనా కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో వర్చువల్‌గా ఈ వేడుకను నిర్వహించారు. బర్మింగ్‌హామ్‌లోని ప్రగతి మండల్‌ ఇందుకు వేదికైంది. మారుతీ శ్రీనివాస్‌, శివ కోటమర్తిల ఆధ్వర్యంలో వేదోక్తంగా సీతారాముల కల్యాణం జరిగింది. భ్రదాచలం నుంచి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో అంగరంగవైభవంగా స్వామివారి కల్యాణం జరిగింది. యూకేతో పాటు, వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు ఆన్‌లైన్‌ ద్వారా స్వామి వారి కల్యాణాన్ని వీక్షించి తరించారు.

Advertisement

Advertisement


మరిన్ని