‘హాస్యబ్రహ్మ’.. అలా నా ఇంటిపేరైంది!
‘హాస్యబ్రహ్మ’.. అలా నా ఇంటిపేరైంది!

తెలుగు ఎన్నారై రేడియోతో డాక్టర్‌ శంకర నారాయణ ముఖాముఖి

ఇంటర్నెట్‌డెస్క్‌: హాస్యబ్రహ్మ అనే బిరుదు తనకు జనం నుంచి వచ్చిందని, అదే ఇంటి పేరుగా స్థిరపడిపోయిందని ప్రముఖ హాస్యావధాని, పాత్రికేయులు డాక్టర్‌ శంకరనారాయణ అన్నారు. తెలుగు ఎన్నారై రేడియోలో ప్రసారమయ్యే ‘స్మైల్‌ రాజా స్మైల్‌’ కార్యక్రమంలో ఆయన అనేక సంగతులు పంచుకున్నారు.

ఈ సందర్భంగా తనకు ‘హాస్య బ్రహ్మ’ బిరుదు ఎలా వచ్చిందో వివరించారు. ‘మాడుగుల ఫణిశర్మ సహస్రావధానం చేస్తున్న సమయంలో నేను అప్రస్తుత ప్రసంగం చేస్తుండేవాడిని. లలితకళా తోరణంలో 60 రోజుల పాటు ఆ కార్యక్రమం జరిగింది. నేను కార్యక్రమానికి వస్తుంటే అందరూ కరతాళ ధ్వనులతో ఆహ్వానించేవారు. ఆ కార్యక్రమ విశేషాలను పత్రికలో ప్రచురించేటప్పుడు నా పేరు ముందు ‘హాస్యబ్రహ్మ’ అని రాయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత పదేళ్లకు చొక్కాపు వెంకటరమణ సన్మానం చేస్తూ నాకు ‘హాస్యబ్రహ్మ’ అనే బిరుదు ఇచ్చారు. అదే నా ఇంటిపేరు అయింది’ అని వివరించారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు, పలువురు శ్రోతలు అడిగిన ప్రశ్నలకు శంకరనారాయణ తనదైన శైలిలో ప్రాసలు, పంచ్‌లు విసురుతూ సమాధానాలు ఇచ్చారు. ఆద్యంతం అలరించేలా సాగిన ఈ కార్యక్రమాన్ని మీరూ వినండి..!


Advertisement


మరిన్ని