తానా సౌజన్యంతో ఆక్సీమీటర్లు, మెడికల్ కిట్ల పంపిణీ
తానా సౌజన్యంతో ఆక్సీమీటర్లు, మెడికల్ కిట్ల పంపిణీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో పల్స్‌ ఆక్సీమీటర్లు, మెడికల్‌ కిట్లను పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్‌ కరోనా పేషెంట్లకు ఉచితంగా మెడికల్‌ కిట్లు అందించారు. అదేవిధంగా వైద్య సిబ్బందికి పల్స్‌ ఆక్సీమీటర్లు ఇచ్చారు.

తానా వారి సౌజన్యంతో వీటిని అందించినట్లు డాక్టర్‌ వెంకటేశ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, వాసిరెడ్డి అర్జునరావు, నెల్లూరు రవి,  మాదాల రామారావు, చిలువేరు బుచ్చి రామయ్య,ఆరోగ్య పర్యవేక్షకుడు భాస్కరరావు, మరియా రాణి, సీహెచ్‌వో సుభాషిణి, ఆరోగ్యమిత్ర రాఘవ, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

మరిన్ని