ఆస్ట్రేలియాలో ప్రకాశం వాసి మృతి
ఆస్ట్రేలియాలో ప్రకాశం వాసి మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్‌బాబు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్‌బాబు ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని అడిలైట్ రాష్ట్రంలో సలిస్‌బరిలో ఉంటున్నారు. ప్రసవం కారణంగా పుట్టింటికి వచ్చిన అతని భార్య కరోనా నేపథ్యంలో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో బిడ్డతో పాటు హరీశ్‌బాబు భార్య నిన్న ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఈ క్రమంలో చెన్నై చేరుకున్న అనంతరం అతని భార్య ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా హరీశ్‌ స్పందించలేదు. దీంతో బంధువులు ఆస్ట్రేలియాలోని హరీశ్‌ నివాసం ఉంటున్న ప్రాంతంలోని వాళ్లకు ఫోన్‌ చేయడంతో అతను మృతిచెందిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న హరీశ్‌ ఎలా మరణించాడో తెలియడం లేదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 


Advertisement

Advertisement


మరిన్ని