కువైట్‌ తెదేపా ఆధ్వర్యంలో డిజిటల్‌ మినీ మహానాడు
కువైట్‌ తెదేపా ఆధ్వర్యంలో డిజిటల్‌ మినీ మహానాడు

కువైట్‌: తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 98వ జయంతిని పురస్కరించుకొని తెదేపా కువైట్‌ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు ఆధ్వర్యంలో డిజిటల్‌ మినీ మహానాడు నిర్వహించారు. ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ గల్ఫ్‌ దేశాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు అమెరికాకు చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌ ప్రసంగం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. తెదేపా ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం ఓ పండగలా చేసుకునే మహానాడును కరోనా విపత్కర పరిస్థితుల వల్ల ఆన్‌లైన్‌లో నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్‌ అండగా ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా కేట్‌ కట్‌ చేసి అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా విజయవాడ ఆపిల్‌ సొసైటీ అనాథ ఆశ్రమంలో తెదేపా కువైట్‌ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

Advertisement

Advertisement


మరిన్ని