అగ్రరాజ్యంలో భారతీయుల సేవా దీపావళి
అగ్రరాజ్యంలో భారతీయుల సేవా దీపావళి

మహమ్మారి వేళ అన్నార్తుల కడుపు నింపుతున్న సంస్థ

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా పరిస్థితులతో ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి కడుపు నింపేందుకు భారతీయ-అమెరికన్లు ఒక్కటయ్యారు. ‘సేవా దీవాళి’ పేరుతో 175 స్వచ్ఛంద సంస్థలు, భారీ సంఖ్యలో వ్యక్తులు కలసి భారీ మొత్తంలో ఆహారాన్ని సేకరించి అన్నార్తులకు ఉచితంగా అందించే మహాక్రతువును చేపట్టారు. అమెరికా వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 60 రోజుల్లో లక్షా 34 వేల కిలోలకుపైగా ఆహారాన్ని సేకరించడం విశేషం. 210 నగరాల్లోని 199 ప్యాంట్రీలు, ఉచిత ఆహార కిచెన్‌లు, ఆశ్రయాల ద్వారా దాన్ని పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. న్యూజెర్సీలో రికార్డు స్థాయిలో 55,330 కిలోల ఆహారాన్ని సేకరించామని నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చదవండి..

ఎన్నారైల కోసం ప్రభుత్వ యాప్‌

వీడియో పంపండి.. క్యాష్‌ గెలుచుకోండి..

Advertisement


మరిన్ని