ఫిన్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
ఫిన్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు

ఫిన్లాండ్‌: ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. విదేశాల్లో ఉన్నా మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా మన తెలుగు వాళ్లు ఎంతో ఆనందంగా ఈ పండుగ నిర్వహించుకున్నారని సంఘం అధ్యక్షుడు పార్లపల్లి రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు రెండు వందల మందికి పైగా హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండేళ్లపాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వేడుకలు మానసిక ఉల్లాసాన్నిచ్చాయని ఆయన తెలిపారు. 

ఈ సందర్భంగా పలువురు నృత్యాలతో అలరించారు. బతుకమ్మ పాటలు, నృత్యాలతో కూడిన ఈ వేడుక దాదాపు ఏడు గంటలపాటు నిరంతరాయంగా సాగింది. సంస్థ నిర్వాహకులు అయిన సింగపురం వినయ్, అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి ఈ వేడుక విజయవంతం అయ్యేలా కృషి చేశారు. పలు రకాల పూలతో బతుకమ్మని తయారు చేయించి పిల్లలు, ఆడపడుచులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడంలో బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్, పంగనామాల వంశీ కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారు.

మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, ఫిన్లాండ్‌లో ఉన్న మన తెలుగు వాళ్లకి అండదండలుగా ఉంటామని సంఘం ఉపాధ్యక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి,  జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి, సత్యనారాయణ తెలిపారు. 

Advertisement

Advertisement

Tags :

మరిన్ని