Lottery: లాటరీ టికెట్‌ కొని మర్చిపోయాడు.. కోటీశ్వరుడయ్యాడు
Lottery: లాటరీ టికెట్‌ కొని మర్చిపోయాడు.. కోటీశ్వరుడయ్యాడు

అమెరికా నార్త్‌ కరోలినాలోని ఓ మెకానిక్‌ను అదృష్టం వరించింది. లాటరీలో దాదాపు 2 లక్షల డాలర్లను(దాదాపు రూ.1.5 కోట్లు) అతడు గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులతో తన కుటుంబ కలలను తీర్చాలని అతడు ఆశపడుతున్నాడు. ఫ్రాంక్‌విల్లే ప్రాంతానికి చెందిన గ్రెగరీ వారెన్‌.. సెప్టెంబరు 29న ఓ చోట గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేయడానికి వెళ్లి, అక్కడ ‘క్యాష్‌ 5 లాటరీ’ టికెట్టును కొనుగోలు చేశాడు. కానీ, అక్టోబరు 4వరకు అతడు ఆ టికెట్‌ సంగతే పట్టించుకోనే లేదు. అనూహ్యంగా అతడు కొనుగోలు చేసిన టికెట్టే లాటరీలో జాక్‌పాట్‌ గెలుచుకుంది. పన్నుల తర్వాత.. దాదాపు రూ. కోటి చెక్కును అందుకున్నాడు వారెన్‌.

Advertisement


మరిన్ని