త్వరలో అమెరికాలో పీవీ విగ్రహావిష్కరణ  
త్వరలో అమెరికాలో పీవీ విగ్రహావిష్కరణ  

హైదరాబాద్‌: అమెరికాలోని అట్లాంటాలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు పీవీ శతజయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపనపై మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు పీవీ ప్రభాకర్‌రావు, మహేశ్‌ బిగాల, చంద్రశేఖర్, అమెరికా ప్రతినిధి పాడి శర్మలు ఇందులో పాల్గొన్నారు. విగ్రహం తయారీ, ఆవిష్కణ తేదీ, కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని