బాలు పాటకు పట్టాభిషేకం
బాలు పాటకు పట్టాభిషేకం

హ్యూస్టన్/టెక్సాస్ : వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్, శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా 10మంది గాయకులు.. 75  పాటలతో బాలు పాటకు పట్టాభిషేకం జరిపించారు. 
జూన్‌ 13న  సాయంత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు టెక్సాస్ /హ్యూస్టన్‌లో అంతర్జాలం వేదికగా ప్రముఖ గాయని, అమెరికా గాన కోకిల శారద ఆకునూరి తన అద్భుతమైన వ్యాఖ్యానంతో, పాటలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంతోషం ఫిలిం న్యూస్, TRINET, తెలుగు కళాసమితి ఒమన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. అతిథులుగా సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు, మాధవ పెద్ది సురేష్, వీణాపాణి, సినీ గీత రచయతలు భువన చంద్ర ,రవిప్రకాష్, యూకే నుంచి డా.నగేష్ చెన్నుపాటి, సురేశ్‌ కొండేటి, ఒమన్ నుంచి  హరి వేణుగోపాల్, వంశీ రామరాజు పాల్గొన్నారు. 

గాయకులు  రామాచారి, వినోద్ బాబు, రాము, ప్రవీణ్ కుమార్, వేణు శ్రీరంగం, సాందీప్, పవన్ చరణ్, హరి గుంట, విపంచి శశిధర్, ధనుంజయ్..  బాలు గారి 75 పాటలను వీనులవిందుగా వినిపించారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని