భారతీయ మహిళలు ప్రత్యేకం
భారతీయ మహిళలు ప్రత్యేకం

  ఖతార్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

గల్ఫ్‌, న్యూస్‌టుడే: భారతీయ మహిళలు ఎన్నో అంశాల్లో ప్రత్యేకత చాటుకున్నారని ఖతార్‌లో భారత రాయబార కార్యాలయం కార్యదర్శి (రాజకీయ, సమాచార) పద్మ కర్రి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దోహాలో వర్చువల్‌ పద్ధతిలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మలావత్‌ పూర్ణ, ఖతర్‌ రేడియో జాకీ, మీడియా నిపుణురాలు అనుశర్మ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రాచీ వర్షీ, తెలంగాణ మొదటి లైన్‌ఉమన్‌ బబ్బూరి శిరీష, రాష్ట్రంలో మొదటి మహిళా మెకానిక్‌ ఆదిలక్ష్మి, కువైట్‌లోని ఏకైక మహిళా ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ ప్రెసిడెంట్‌ గొడిశాల అభిలాషలు ఇందులో పాల్గొని తాము విజయాలు సాధించిన తీరును వివరించారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని