ప్రపంచ దేశాలకు భారత వ్యాక్సిన్‌ సేవలు కొనసాగుతాయి
ప్రపంచ దేశాలకు భారత వ్యాక్సిన్‌ సేవలు కొనసాగుతాయి

దక్షిణాఫ్రికా అధ్యక్షునితో ప్రధాని మోదీ

దిల్లీ: ఆఫ్రికా సహా అన్ని దేశాలకూ అవసరమైన వ్యాక్సిన్లు, ఫార్మాస్యూటికల్స్‌ను ఉత్పత్తిచేసే సామర్థ్యం భారత్‌కు ఉందని, ఇది కొనసాగుతుందని... దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాపోసాకు ప్రధాని మోదీ తెలిపారు. నేతలిద్దరూ గురువారం ఫోన్‌లో సంభాషించుకున్నారు. ఉభయ దేశాల్లో మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లు, టీకా కార్యక్రమంపై వారిద్దరూ చర్చించుకున్నట్టు ప్రధాని కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని