కువైట్‌లోని భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోండి
కువైట్‌లోని భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోండి

కేంద్రప్రభుత్వానికి సూచించిన సుప్రీం కోర్టు

దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా కువైట్‌లో చిక్కుకున్న మిగిలిన భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కువైట్‌లో చిక్కుకున్న వారిని భారత్‌ తరలించేందుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కువైట్‌లో ఉన్న 1.3 లక్షల మందిలో ఇప్పటికే 87,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని కేంద్రం.. న్యాయస్థానానికి నివేదించింది. స్పందించిన ధర్మాసనం సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని